Site icon NTV Telugu

ఐఐఎఫ్ఎం 2021 అవార్డ్స్ : ఉత్తమ నటిగా సమంత

The Family Man 2's Shahab Ali Confirms Those Scenes Were Edited Out

అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఉత్తమ నటి అవార్డు వరించింది. తాజాగా “ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021” అవార్డ్స్ ను ప్రకటించింది. ఇందులో “ఫ్యామిలీ మ్యాన్-2” రెండు అవార్డులను దక్కించుకుంది. మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. సమంత అక్కినేని ఈ సిరీస్‌ లో ఉత్తమ నటన కనబర్చినందుకు అవార్డును సొంతం చేసుకుంది. రాజీగా ఈ సిరీస్‌లో డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

అయితే అంతకన్నా ముందు ఈ వెబ్ సిరీస్ లో సామ్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజీ పాత్ర తమ మనోభావాలను దెబ్బ తీసింది అంటూ తమిళ తంబీలు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. “బ్యాన్ ఫ్యామిలీ మ్యాన్-2” అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపట్టారు. అయితే దర్శకనిర్మాతలు మాత్రం ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదని, దయచేసి వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేదాకా ఎదురు చూడమని కోరారు. కానీ కోలీవుడ్ లో కొంతమంది ఆగ్రహం చల్లారలేదు. అప్పటికే ట్రైలర్ లో తమిళులు అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలను తొలగించారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో ముందుగా అన్ని ఈ సిరీస్ ను విడుదల చేయాలనుకున్న భాషలన్నిటిలో వాయిదా వేసి కేవలం హిందీ వెర్షన్ ను తెరపైకి తీసుకొచ్చారు.

Read Also : “ఆకాశం నీ హద్దురా”కు మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

అలా నిరసన సెగల మధ్య ఓటిటిలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సమంత నటనకు సౌత్ నుండి నార్త్ దాకా అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకున్న “ఫ్యామిలీ మ్యాన్” రిలీజ్ తరువాత మాత్రం వరుసగా అవార్డులను సొంతం చేసుకుంటున్నాడు. 2021 జూన్ 4న విడుదలైన థ్రిల్లర్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఏకంగా 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పేయి, ఉత్తమ నటి ప్రియమణి, ఉత్తమ సిరీస్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ డైలాగ్స్ వంటి విభాగాల కింద ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా విడుదల కానుంది.

ఐఐఎఫ్ఎం 2021 అవార్డ్స్ లో “మీర్జాపూర్ సీజన్ 2” కూడా ఉత్తమ సిరీస్ అవార్డును గెలుచుకుంది. అత్యుత్తమ భారతీయ నటులలో ఒకరైన పంకజ్ త్రిపాఠికి ‘డైవర్సిటీ ఇన్ సినిమా’ పురస్కారం లభించింది. ‘షట్ అప్ సోనా’ ఉత్తమ డాక్యుమెంటరీని గెలుచుకుంది. “సూరారై పొట్రు”లో అద్భుతమైన నటనకు సూర్య ఉత్తమ నటుడు అవార్డు (ఫీచర్) గెలుచుకున్నాడు.

Exit mobile version