NTV Telugu Site icon

ASOV : అమ్మ కాదు అంటే ఈ సినిమా చేసేవాడిని కాదు : కళ్యాణ్ రామ్

Nkr

Nkr

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నాడు.తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్నీ AAA లో గ్రాండ్ గా నిర్వచించారు.

Also Read : Gopichandh Malineni : జాట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే.?

ఈ ఈవెంట్ లో హీరో కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘ ఈవెంట్ కు విచ్చేసిన నందమూరి అభిమానులకు ధన్యవాదాలు. కర్తవ్యం సినిమాలో అమ్మ చేసిన ఫైట్స్, ఎమోషన్స్ మనకి బాగా గుర్తుంటాయి. వైజయంతి పాత్రకి కొడుకు ఉంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయో అదే ఈ సినిమా అని దర్శకుడు ప్రదీప్‌ చెప్పాడు. అయితే అమ్మ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేస్తానని చెప్పా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. ఈ వయసులో కూడా ఎలాంటి డూప్‌ సహాయం లేకుండా ఫైట్స్ చేయడం మాములు విషయం కాదు నిజంగా అద్భుతం. యాక్టర్ పృద్వికి యానిమల్ ఎంత పేరు తెచ్చిందో మా సినిమా కూడా అంత పేరు తెస్తుంది. అమ్మ తన బిడ్డకి జన్మనిచ్చేందుకు ప్రాణాన్ని పణంగా పెడుతుంది. అలాంటి తల్లిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు అదే ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. బలమైన భావోద్వేగాలున్న కథ ఇది. అమ్మ విజయశాంతితో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవం. ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ లాంటిది ఈ నిర్మాతలు నా సొంత వాళ్ళు’ అని అన్నారు.