Site icon NTV Telugu

Samantha: ఏ మాయ చేసావే మహేష్ చేసి ఉంటే.. సామ్ లైఫ్ మరోలా ఉండేదా..?

Sam

Sam

Samantha: ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత.. ఈ ఒక్క సినిమా .. ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోయిన్ గా మారడానికి కానీ, నాగ చైతన్యతో పెళ్ళికి దారి తీసింది కానీ.. ఈ సినిమా వలనే.. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే సామ్- చై ప్రేమలో పడ్డారు. ఇక ఇక్కడ ప్రేమ ఫలించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో ముచ్చటగా ఉన్న ఈ జంట నాలుగేళ్లు తిరగకముందే విడాకులు తీసుకొని విడిపోయారు. ఒకవేళ ఆ సినిమాలో చైతూ హీరో కాకపోయి ఉంటే.. సామ్ లైఫ్ ఇప్పుడు వేరేలా ఉండేదా..? అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటే.. ఏ మాయ చేసావే సినిమా కోసం మొదట అనుకున్న హీరో నాగ చైతన్య కాదట.. ఈ విషయాన్నీ ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్ స్వయంగా చెప్పాడు. ముత్తు సినిమా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ ” మొదట ఏ మాయ చేసావే కథను మహేష్ బాబుకు వినిపించాను.. ఆయన ఇలాంటి లవ్ స్టోరీ కాకుండా ఏదైనా యాక్షన్ సినిమా చేద్దాం అని అన్నారు. ఆ తరువాత నాగ చైతన్య కథకు బావుంటాడని తీసుకున్నాం” అని చెప్పుకొచ్చాడు.

ఇక ఒకవేళ చై ప్లేస్ లో మహేష్ ఉండి ఉంటే సామ్ లైఫ్ ఇప్పుడు మరోలా ఉండేది.. అయితే ఇప్పటిలా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండేది.. లేకపోతే చై ప్లేస్ లో వేరొక వ్యక్తిని వివాహం చేసుకొని ఉండేది. ఇవన్ని జరిగి ఉంటే సామ్ ను ఇంతమంది అభిమానులు అభిమానించేవారు కాదేమో అని మరికొందరు అంటున్నారు. సామ్ కు అభిమాన బలం పెరిగిందే అక్కినేని ఇంటి కోడలిగా మారిన తరువాత.. అదే జరుగక పోయి ఉంటే.. మిగతా హీరోయిన్ల లానే ఆమె కూడా ఒక సీనియర్ హీరోయిన్ గా మిగిలి ఉండేది. ఇన్ని ట్రోల్స్, ఇన్ని విమర్శలు ఉండేవి కాదు. ఒకవేళ వేరే వ్యక్తితో విడాకులు అయినా కూడా అభిమానులు అంతగా విమర్శించేవారు కాదని చెప్పుకొస్తున్నారు. ఇక మరికొందరు దాన్నే విధి అంటారు. ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉంటారో ఆ దేవుడు వారిని కలపడానికి మిగతావారిని తప్పిస్తారు అని అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా.. ఎవరు ఏ సినిమా చేసినా ప్రస్తుతం ఈ జంట ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు.. ఎవరి జీవితాన్ని వారు మలుచుకుంటున్నారు. అందుకు సంతోషమే కదా అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version