Site icon NTV Telugu

Hi Nanna: “ఇదే ఇదే”… లాస్ట్ సాంగ్ అవుతుందా ఇంకోకటి ఉందా?

Hi Nanna

Hi Nanna

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కొత్త డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది అంటే మరి కొన్ని గంటల్లో హాయ్ నాన్న సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. హాయ్ నాన్న సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ హాయ్ నాన్న సినిమాపై అంచనాలు పెంచాయి. హాయ్ నాన్న సినిమా పదేళ్ల పాటు గుర్తుంటుంది అంటూ నాని ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అనిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ ఇంపాక్ట్ హాయ్ నాన్న సినిమా ఓపెనింగ్స్ ని పడే అవకాశం ఉంది. అయితే రిలీజ్ కి మరి కొన్ని గంటలే ఉండగా హాయ్ నాన్న మూవీ నుంచి “ఇదే ఇదే” సాంగ్ బయటకి వచ్చింది.

5వ పాటగా బయటకి వచ్చిన ఇదే ఇదే సాంగ్ ఫీల్ గుడ్ మూడ్ ని క్యారీ చేసింది. కృష్ణ కాంతా లిరిక్స్ అండ్ హేషం అబ్దుల్ వాహబ్ వోకల్స్ ఇదే ఇదే సాంగ్ ని స్పెషల్ గా మార్చాయి. మ్యూజికల్ గా హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ కొట్టిందనే చెప్పాలి. ఇదే ఇదే లాస్ట్ సాంగా లేక ఇంకో పాట కూడా బయటకి వస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే నాని హాయ్ నాన్న సినిమాలో ఆరు పాటలు ఉన్నాయని చెప్పాడు. బయటకి వచ్చింది అయిదు పాటలే కాబట్టి ఇంకో సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. అది ఈవెనింగ్ లోపు రిలీజ్ చేస్తారా లేక సినిమాలో డైరెక్ట్ గా చూడాల్సిందేనా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version