Icon Star Allu Arjun to represent the Indian cinema at Berlin film festival:ఇటీవల పుష్ప చిత్రంలో ఉత్తమ నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఈ ఉత్తమనటుడి పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు నటుడుగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసినప్పటి నుంచి ఆయనకు పలు అరుదైన ఘనతలు అందుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఐకాన్ స్టార్ మరో అరుదైన గౌరవాన్ని పొందారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇప్పుడు అల్లు అర్జున్‌కు దక్కింది. ఈ సందర్భంగా ఆయన బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు గురువారం జర్మనీకి పయనమయ్యారు. ఇక పుష్ప చిత్రంతో ఆయన ప్రతిభ ప్రపంచమంతటా గుర్తించిన సంగతి తెలిసిందే.
Oy Movie: ఓరీ.. మీ దుంపలు తెగ.. లవ్ స్టోరీని రివెంజ్ స్టోరీగా మార్చారు కదరా
ఆగస్టు 15న విడుదల కానున్నపుష్ప-2 ,చిత్రంలో ఆయన ప్రపంచమంతటా మరింత పాపులారిటిని పొందనున్నారని అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ గా నిలవడంతో రెండవ భాగాన్ని మరింత భారీ ఎత్తున సుకుమార్ తెరకెక్కస్తున్నారు. ఆగస్టు 15 నుంచి వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా అది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. సినిమా యూనిట్ మాత్రం ఖచ్చితంగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని బలంగా చెబుతోంది.