NTV Telugu Site icon

Allu Arjun: కట్టె కాలేంత వరకు చిరంజీవి అభిమానినే..

Bunny

Bunny

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో బన్నీ ఎప్పుడు ముందు ఉంటాడు. చిన్న సినిమాలు హిట్ అయినా.. వారికి సపోర్ట్ గా ఉండాలన్నా మొదటి వరుసలో ఉంటాడు. తన మనసుకు నచ్చిన సినిమా గురించి అయితే ట్వీట్ చేసి మరీ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఉంటాడు. ఇక తాజాగా బేబీ సినిమాను బన్నీ మెచ్చుకున్నాడు. ట్వీట్ లా కాకుండా ఏకంగా ఒక అప్రిషియేషన్ మీట్ పెట్టి మరీ సినిమాను, చిత్ర బృందాన్ని ప్రశంసించాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. SKN నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా నచ్చడంతో బన్నీ.. అప్రిషియేషన్ మీట్ పెట్టి మరీ చిత్రబృందాన్ని ప్రశంసించాడు.

ఇక ఈ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సినిమా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సాయి రాజేష్ ఇలాంటి సినిమా చేస్తాడని అనుకోలేదు. చాలా బాగా తీశాడు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాను నేను చూసిందే లేదు. ఒక సినిమా బావుంటే.. ఖచ్చితంగా మీడియా లేపుతుందని తెలుసు.. సినిమా మంచి విజయం అందుకున్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నా.. ఒక లవ్ లో ఉన్న పెయిన్ ను తెలిపే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. 7జీ బృందావన్ కాలనీ, అర్జున్ రెడ్డిలాంటి సినిమాలు. ఇవన్నీ స్క్రిప్ట్ లు రాస్తేనే.. సినిమాలు చూస్తేనే రావు.. ఇలాంటి సినిమాలు జీవితం నుంచి ఇన్స్పైర్ అయ్యి తీయాలి. అలా సాయి రాజేష్ తీసిన విధానం ఆకట్టుకొంటుంది. అసలు మీరు నమ్మరు.. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఊగిపోతూ సినిమా చూసాను. అంత బావుంది సినిమా. SKN గురించి చెప్పాలి.. ఆయన గురించి నాకు చెప్పింది సిరి.. ఇక చెప్పనవసరం లేదు.. కట్టె కాలేవరకు మేము చిరంజీవి అభిమానులమే. అది మారదు. ఒక సమయంలో అందరి హీరోల ఫ్యాన్స్ మమ్మల్ని తిడుతుంటే.. ఒక్కడు మాత్రం .. అందరికి రిప్లై ఇస్తున్నాడు.. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా రిప్లై ఇవ్వడం చూసి శిరీష్ నాకు చెప్పాడు. ఆ తరువాత SKN ను తీసుకొచ్చి.. ఒక చిన్న రూమ్ ఇచ్చి ఉండమని చెప్పాను. ఆ తరువాత జర్నలిస్ట్ గా చేసుకుంటూ.. ఇక్కడవరకు వచ్చాడు. ఎప్పుడు అడిగినా బేబీ అనే సినిమా తీస్తున్నా బాస్ అనేవాడు.. అదేమైనా బాహుబలినా అన్నేళ్లు తీస్తున్నావ్ అని అడిగేవాడిని.. లేదు బాస్ ఈసారి మంచిగా వస్తుంది అని నమ్మకం ఉంది అనేవాడు. నిజంగానే కల్ట్ సినిమా తీసాడు. నీకు ఇంత మంచి జర్నీ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. ప్రతి మనిషి కోరుకొనే ఐడెంటిటీని SKN ఇప్పుడు అందుకున్నాడు.

ఇక నటీనటుల గురించి చెప్పాలంటే.. ఆనంద్.. నీ నటన అద్భుతం. విరాజ్.. నీ స్టైల్ బాగా నచ్చింది. ఒక కాలేజ్ కుర్రాడిలానే కనిపించావు. ఇక వైష్ణవి గురించి చెప్పాలంటే.. స్దగం ఈ మీట్ పెట్టడానికి ఆమె కారణం. అల వైకుంఠపురం సినిమాలో నా చెల్లెలిగా చేసినప్పుడు.. ఒకసారి అనుకున్నాను. ఇలాంటి అమ్మాయిని పెట్టి సినిమా తీయాలని.. ఇప్పుడు అది నెరవేరింది. తెలుగులో హీరోయిన్లు అసలు రావడం లేదు. అన్ని భాషల నుంచి హీరోయిన్లు వస్తున్నారు. కానీ, తెలుగు నుంచి హీరోయిన్లు ఎందుకు రావడం లేదని ఆరేడేళ్ల నుంచి నా మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు వైష్ణవి వలన.. ఎంతోమంది అమ్మాయిలు ముందుకు రావాలి.. అమ్మాయిలు.. వచ్చేయండి.. ఇక్కడ చాలామంచి అవకాశాలు వేచి ఉన్నాయి. టాలీవుడ్ అంటే.. ఎంతోమందిని అక్కున చేర్చుకొనేది. పేరెంట్స్ ను ఒప్పించి రండి.. లేకపోతే సక్సెస్ అయ్యాకా ఒప్పించండి. ఈ ఏడాది వైష్ణవి అవార్డు తీసుకొంటుంది. అది చూసి.. హీరోయిన్ గా రావాలనుకునేవారు మేము కూడా సక్సెస్ అవుతామని ముందుకు వస్తారు” అని చెప్పుకొచ్చాడు.