I Bomma Ravi : కొన్ని సార్లు తప్పులు చేసిన వారికి కూడా మద్దతు దొరుకుతుంది. ఎందుకంటే ఆ తప్పుల వల్ల లబ్దిపొందిన వారు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఐ బొమ్మ రవికి కూడా ఇలాంటి మద్దతే వస్తోంది. ఐ బొమ్మ, బప్పం లాంటి వెబ్ సైట్లతో కొత్త సినిమాల డిజిటల్ ప్రింట్ లు ఎన్నో పైరసీ చేశాడు. పెద్ద పెద్ద సినిమాల దగ్గరి నుంచి వెబ్ సిరీస్ ల దాకా ఎన్నో పైరసీ చేశాడు. ఎన్నేళ్లుగా ట్రై చేసినా దొరక్కుండా తప్పించుకున్నాడు. చివరకు పోలీసులు, రాజకీయ నేతలకే సవాళ్లు విసిరాడు. కానీ అనుకోకుండా దొరికిపోయాడు.
Read Also : Nora Fatehi : దావూద్ డ్రగ్ రాకెట్ వివాదంపై.. సీరియస్‌గా స్పందించిన నోరా ఫతేహి
అయితే రవి అరెస్ట్ పై రకరకాల పోస్టులు వస్తున్నాయి. రవికి మద్దతుగా నెటిజన్లు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. సినిమాల టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే.. ఈ ఐబొమ్మ వల్లే తాము చూడగలిగాం అంటున్నారు. ఐబొమ్మ లేకపోతే ఈ పాటికి టికెట్ రేట్లు విపరీతంగా పెంచేవాళ్లని.. కాబట్టి రవిని విడిచిపెట్టాలంటున్నారు. వాస్తవానికి రవి వల్ల టాలీవుడ్ కు పెద్ద నష్టమే జరిగింది. వందల కోట్లు నిర్మాతలు నష్టపోయారు. సినిమా నిర్మాతలకు రవి వల్ల నష్టమే జరిగింది.. కానీ ఎట్ ది సేమ్ టైమ్ పైరసీ వల్ల లబ్దిపొందిన ప్రేక్షకులు ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. రవికి ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
Read Also : Kajol & Twinkle : మేమిద్దరం ఓకే హీరోతో డేట్ చేశాం.. స్టార్ హీరోయిన్స్ బోల్డ్ కామెంట్స్
