Site icon NTV Telugu

IB 71: ‘ఘాజీ’ దర్శకుడి మరో మిషన్… ట్రైలర్ అదిరింది

Ib 71

Ib 71

భారతీయులకి తెలియని ‘ఇండో-పాక్’ మధ్య జరిగిన ఒక యుద్ధ కథతో ఘాజీ సినిమా చేసి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు సంకల్ప్ రెడ్డి. ఇండియాస్ ఫస్ట్ సబ్-మెరైన్ సినిమాగా రిలీజ్ అయిన ఘాజీ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమా చెయ్యగలడా అని ఘాజీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాతో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసిన సంకల్ప్ రెడ్డి మరోసారి తన మార్క్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. బాలీవుడ్స్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరోల్లో ఒకడైన విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ‘IB 71’ అనే టైటిల్ తో తెరకెక్కింది. మే 12న రిలీజ్ కానున్న ఈ మూవీ 1971లో ఇండియన్ ఏజెంట్స్, పాకిస్తాన్ లోకి వెళ్లి చేసిన ఒక మిషన్ ఆదరంగా రూపొందింది.

దాదాపు 50 ఏళ్లుగా ఇండియన్ హిస్టరీలో దాగి ఉన్న ఒక సెక్రెట్ మిషన్ ని గురించి కథ ఇది. 30 మంది ఏజెంట్స్, పది రోజుల్లో, ఒక మిషన్ ని పాకిస్తాన్ వెళ్లి ఎలా కంప్లీట్ చేశారు అనేది తెలియాలి అంటే మే 12న థియేటర్స్ కి వెళ్లి చూడండి, మేము జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తాం అంటూ మేకర్స్ ‘IB 71’ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇంటెన్సిటీ, దేశ భక్తీ, హీరోయిక్ సాక్రిఫైజ్, బ్రేవ్ ఎఫోర్ట్… ఈ ట్రైలర్ నిండా ఉన్నాయి. 1971 నాటి పరిస్థితులకి తగ్గట్లు చేసిన ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ కి ప్రశాంత్ విహారీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేసింది. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇవ్వడం గ్యారెంటీ అనే నమ్మకం కలిగించడంలో ‘IB 71’ ట్రైలర్ సక్సస్ అయ్యింది. మరి మే 12న ఘాజీ మ్యాజిక్ ని సంకల్ప్ రెడ్డి రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

Exit mobile version