పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాలలో ఎంతటి స్టార్ డమ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు చేస్తూనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గళం విప్పుతూ వస్తున్నారు. రైతుల సమస్యలు, యువత ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆయన తీసుకునే స్టాండ్ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
Also Read : NTRNeel : ప్రశాంత్ నీల్ సినిమా షూట్ కు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్
సినీ రంగంలో స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్, రాజకీయాల్లోనూ అదే స్థాయిలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటే, భవిష్యత్తులో దేశ నాయకత్వ బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదని ఆయనని దగ్గరగా చుసిన వారు చెప్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పవర్ స్టార్ తో హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. నిధి అగర్వాల్ మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ సింహంలాంటివాడు. ఆయనకు ఒంటరిగా నిలబడి పోరాడే ధైర్యం ఉంది. ప్రజల కోసం, తన సిద్ధాంతాల కోసం రాజీ పడకుండా నిలబడే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌కు ఉంది. అలాంటి లక్షణాలు ఉన్న నాయకులు అరుదుగా ఉంటారు. అదే సమయంలో, “భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని అయితే నాకు ఏమాత్రం ఆశ్చర్యం ఉండదు” రాష్ట్ర రాజకీయాలకే కాకుండా జాతీయ స్థాయిలోనూ పవన్ కళ్యాణ్ ప్రభావం చూపగల సామర్థ్యం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నిధి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
I won't be surprised if #PawanKalyan becomes PM of our country says, #NidhhiAgerwal
— Filmyscoops (@Filmyscoopss) January 21, 2026
