Site icon NTV Telugu

Posani Case : రోజుకు జైలుకు పోసాని.. ఇప్పట్లో బయటకు రాడా.?

Posani

Posani

సినీనటుడు పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ పరిశ్రమమీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన కేసులో పోలీసులు పోసానిని అరెస్టు చేసి కోర్టుమందు హాజరు పెట్టగా, రైల్వే కోడూరు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించింది. పోసాని రిమాండ్ లో ఉండగానే రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి.

Also Read : 14 DaysGirlFriendIntlo : ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ చిత్రానికి దర్శక దిగ్గజాల విషేష్

మరోవైపు పోసాని న్యాయవాదులు ఈ కేసులో ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసారని, బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కానీ పోసానిపై మిగతా స్టేషన్స్ లో నమోదు అయిన కేసులు కారణంగా పోసాని ఇప్పటికి జైల్లోనే ఉన్నారు. పోసాని కృష్ణ మురళిపై తాజాగా విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు అయింది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి ను కర్నూల్ నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడ తీసుకొస్తున్నారు భవానిపురం పోలీసులు. నేరుగా పోసాని కృష్ణ మురళిని విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరు పరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఈ రోజు సాయంత్రం మూడున్నర నుండి నాలుగు గంటల లోపు కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత ఏర్పాట్లు చేసారు విజయవాడ పోలీస్ కమిషనర్.

Exit mobile version