స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి లయ. 1999 ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో మూడు నంది అవార్డ్స్ అందుకున్న నటిగా లయకు రికార్డు కూడా ఉంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరలో ఉండగా స్వయంవరం సినిమా చేసిన లయ తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న లయ లాంగ్ గ్యాప్ తర్వాత నితీన్ నటించిన తమ్ముడు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
Also Read : Kollywood : ఆయన సినిమాలో నటించేందుకు బాలీవుడ్ హీరోల రిక్వెస్ట్
ఈ సినిమా ప్రమోషన్స్ లో తన చిన్న నాటి జ్ఞాపకాలను పంచుకుంది. లయ మాట్లాడుతూ ‘ నేను రెండో తరగతి నుండి చెస్ నేర్చుకుని పోటీలలో పాల్గొన్నాను. అలా ఏడుసార్లు స్టేట్ అవార్డ్స్, ఓ నేషనల్ మెడల్ కూడా సాధించాను. అలా నా పదవ తరగతి వరకు చెస్ ఆడాను. కానీ ఆ తర్వాత కోచింగ్ కు వెళ్లడం కుదరలేదు. చెస్ కోచింగ్ అంటే గంటల తరబడి సాధన చేయాలి. టెన్త్, ఇంటర్మీడియట్ లో చదువు మీదా కాన్సంట్రేట్ చేస్తూ చెస్ ను వదిలేసాను. కానీ ఇంటర్ లో ఉండగా స్వయంవరం చేశాను. ఆ కారణంగా కాలేజ్ కు వెళ్లడం కుదరలేదు. అయిన కూడా ఎంసెట్ లో 13,126 ర్యాంక్ వచ్చింది. కానీ ఇంజినీరింగ్ చేస్తున్నపుడు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ నా ఎంసెట్ ర్యాంక్ ను లారీ నంబర్ ఫన్నీగా కామెంట్స్ చేసేవారు’ అని తెలిపింది. తాజాగా రిలీజ్ అయిన తమ్ముడులో లయకు మంచి పేరు వచ్చింది. అలా సినిమా ప్రమోషన్స్ లో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది లయ.
