మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వేఫేరర్ ఫిలిమ్స్ పై నిర్మించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1′. డొమినిక్ అరుణ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించగా ప్రేమలు ఫేమ్ నస్లీన్ ముఖ్య పాత్ర పోషించాడు.’కొత్త లోక’ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా చాప్టర్ 1 గా కొత్త లోక ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తోలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది.
Also Read : Nithiin – Vaitla : నితిన్ – శ్రీను వైట్ల.. అవన్నీ ఫేక్..
కాగా ఈ సినిమా గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు నిర్మాత దుల్కర్ సల్మాన్. ఓ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ’ నిర్మాతగా నేనులోక సినిమాకోసం పెట్టిన పెట్టుబడి మొత్తం కోల్పోతామని అనుకున్నాము. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఇది చాలా మంచి సినిమా అని మాకు తెలుసు, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మళయాలంలో ఇంత బడ్జెట్ అంటే చాలా రిస్క్. కానీ కథని నమ్మి పెట్టాను. అలాగే థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ అంతగా ఆసక్తి చూపడం లేదు. లోక ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తే సీక్వెల్ లో మేము లాభం పొందవచ్చని నేను అనుకున్నాను. ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్ చేసాము. కానీ ఈ విజయం ఊహించలేనిది. మొదటి రోజు నుండి మా సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే మా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ‘ అని అన్నారు.
