NTV Telugu Site icon

Tolly wood : నేను ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను..

Untitled Design

Untitled Design

టాలీవుడ్ లోని బడా నిర్మాతలలో దగ్గుబాటి సురేష్ ఒకరు. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దగ్గుబాటి రానా. తొలి చిత్రం లీడర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. తదుపరి కొన్ని ఫ్లాప్ లు రావడంతో రొటీన్ కథలకు గుడ్ బై చేప్పేసాడు. మరోవైపు బాలీవుడ్ లో మంచి కథ బలం ఉన్న సినిమాలలో నటించి తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. బాహుబలి రెండు భాగాలలో ప్రతిపక్ష నాయకుడి పాత్రలో రానా నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. భల్లాలదేవ పాత్రలో అద్భుతంగా నటించి పలు అవార్డులు గెలుచుకున్నాడు. బాహుబలి క్రేజ్ తో తర్వాత వరుస సినిమాలు ఆఫర్లతో రానా ఫుల్ బిజీ అవుతాడని అందరూ ఊహించారు. కానీ రానా చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకొంటున్నాడు.

కాగా రానా IIFA అవార్డ్స్ కార్యక్రమానికి హాజరవగా తదుపరి సినిమా ఎప్పుడు రాబోతోందని మీడియా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానంగా రానా బదులిస్తూ ” లైఫ్ అంతా కొత్త జానర్ సినిమాలే చేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు అవన్నీ మామూలు సినిమాలు అయిపోయాయి. అందరూ హీరోలు ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు. కాబట్టి నేను చేయడం ఆపేసాను. కొత్తగా ఏదైనా సినిమా చేయాలి అని వెతుకుతున్నాను, ఇండస్ట్రీలో డిఫ్రెంట్ జోనర్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ చేసిందే నేను, త్వరలో ఎవరు చేయని కథతో సినిమా చేస్తాను, ఆ చిత్ర విశేషాలు మీడియా ముఖంగా వెల్లడిస్తాను” అని అన్నారు. లీడర్ 2 గురించి రానాను అడగగా ఆ విషయం దర్శకుడు శేఖర్ కమ్ముల ను అడగండి అని అన్నారు. కల్కి చిత్రం సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రిలీజ్ కు, ముందునుండే కల్కి సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకం ఉంది అని అన్నారు.

Show comments