I am the first ever to do a condom awareness campaign in Andhra Pradesh says Siddarth: కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం భారతీయుడు 2, ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. జులై 12వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా టీం నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇక ఈ ఉదయం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి ఇటీవల రేవంత్ రెడ్డి టికెట్ రేట్ ల పెంపు కోసం సినిమా టీమ్స్ ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పుడు సోషల్ అవేర్నెస్ కోసం కొన్ని వీడియోలు చేయాలని సూచించారు, మీరు ఏవైనా సోషల్ అవేర్నెస్ కోసం వీడియోలు చేస్తున్నారా? మీకు ఎంతవరకు సామాజిక బాధ్యత ఉంద అని ప్రశ్నించారు.
Spirit: స్పిరిట్.. అంచనాలు పెంచేసుకోవద్దు.. జరిగితే మంచిదే!
దానికి స్పందించిన సిద్ధార్థ నేను 20 ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు 20 ఏళ్ల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సేఫ్ సెక్స్ కోసం కండోమ్ పట్టుకొని రోడ్ ఎక్కాను. దాదాపుగా అప్పట్లో ఈ కండోమ్ ప్రచారానికి సంబంధించి నా ఫోటోలతో ఏపీ మొత్తం హోర్డింగ్స్ ఉండేవి, ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెబితే నాకు బాధ్యత రాదు. అలాగే ఒక యాక్టర్ కి బాధ్యత సామాజిక బాధ్యత ఉందా అని అడిగితే అసలు ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ప్రతి నటుడు, నటి సామాజిక బాధ్యతతోనే ఉంటారు. మాకు ఉన్న సామాజిక స్పృహ నేపథ్యంలో మేం చేయగలిగింది మేం చేస్తాం .ముఖ్యమంత్రి మమ్మల్ని ఏమైనా కావాలని కోరితే మేము చేస్తాం. ఏ సీఎం కూడా మీరు ఇది చేస్తేనే మీకు అది చేస్తామని చెప్పలేదు అంటూ ఆయన కామెంట్ చేశారు.