NTV Telugu Site icon

Hyper Aadhi: హైపర్ ఆది పెళ్లి.. ఆమెతో ఏడడుగులు వేసిన జబర్దస్త్ కమెడియన్..?

Aadi

Aadi

Hyper Aadhi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఒక పక్క షోస్.. ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక బుల్లితెరపై పెళ్లి కానీ ప్రసాద్ ల లిస్ట్ తీస్తే.. ప్రదీప్, సుధీర్ ల తరువాత హైపర్ ఆది పేరునే వినిపిస్తుంది. ఎప్పటినుంచో హైపర్ ఆది పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి కానీ, ఒక్కటి కూడా అందులో నిజం లేదు. ఇక ఎన్నో ఈవెంట్స్ లో ఆ యాంకర్ తో పెళ్లి.. ఈ హీరోయిన్ తో పెళ్లి అంటూ ప్రోగ్రామ్స్ చేయడమే కానీ, నిజంగా హైపర్ ఆది పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇక తాజాగా హైపర్ ఆది మరోసారి పెళ్లి కొడుకుగా మారాడు. మరోసారి అన్నప్పుడే అర్దమయ్యిపోయి ఉంటుంది… ఇది కూడా ఈవెంట్ కోసమే అని. కానీ ఇది ఈవెంట్ కోసంకాదు .. ఢీ సెట్ లో ఆది పెళ్లి కొడుకుగా మారాడు. ఇక ఈసారి వధువుగా హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్.

Biggboss 7 Telugu: బ్రేకింగ్.. హౌస్ కు గుడ్ బై చెప్పిన శివాజీ.. ?

బిగ్ బాస్ ఫేమ్ సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన సన్నీ, హ్రితిక.. ఢీ షోలో సందడి చేసారు. ఇక ఆమెను చూడగానే ఆది .. పెళ్లి కొడుకు గెటప్ లో వచ్చి.. హ్రితికతో పెళ్లి అని చెప్పడమే కాకుండా.. ఆమెతో ఏడడుగులు వేస్తున్నట్లు స్టేజిమీదనే తిరుగుతూ కనిపించదు. ఇక ఇదంతా చూసి సన్నీ షాక్ అవ్వగా.. జడ్జిలు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇవన్నీ కాకుండా హైపర్ ఆది.. నిజంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో చూడాలి.

Show comments