హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కాఠిన్యం మరోసారి బయటపడింది. నిబంధనలు ఉల్లంఘించిన వారు సామాన్యులు అయినా సెలబ్రిటీలు అయినా వారిని ఆపి జరిమానా విధిస్తూ తమ్ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచు ట్రాఫిక్ పోలీసులు టింటెడ్ గ్లాస్ నిబంధనను ఉల్లంఘిస్తున్న వారిపై నిఘా పెట్టిన విషయం తెలిసిందే.. ఇందులో ఎక్కువ సెలబ్రిటీలు ఉండడం విశేషం. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ కార్లను అడ్డుకొని కార్లకు ఉన్న బ్లాక్ఫిల్మ్ ను తొలగించి, జరిమానా విధించిన విషయం తెల్సిందే.
ఇక తాజాగా అక్కినేని వారసుడు నాగ చైతన్య కారును కూడా పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ వద్ద చై కారును పోలీసులు అడ్డుకున్నారు. కారులో చై కూడా ఉండడంతో .. బ్లాక్ ఫిల్మ్ వాడుతున్నందుకు అతనికి రూ. 700 జరిమానా విధించి, కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. ఇక చైతన్య కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అక్కినేని హీరో చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఏ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
