Site icon NTV Telugu

Harsha Sai : హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్టు?

Rj Shekar Basha

Rj Shekar Basha

Harsha Sai: కలకలం రేపిన హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషాని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.. హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా శేఖర్ భాషాని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం ఆయనని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడు గంటలగా సైబర్ క్రైమ్ ఆఫీస్ లో ఆర్జె శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలికి సంబంధించిన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆమెపై అసత్య ప్రచారాలు చేసినందుకు శేఖర్ భాషా పై సైబర్ క్రైమ్ లో హర్ష సాయి బాధితురాలు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి హర్ష సాయి మీద హర్ష సాయి హీరోగా నటించిన మెగా సినిమా నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ ఫిర్యాదు చేసింది.

Also Read: Balakrishna: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న ఏపీ హోమ్ మంత్రి

తమ రేప్ చేశాడని నగ్నంగా ఉన్న వీడియోలుతో బెదిరిస్తున్నాడని పలు సెక్షన్ల కింద ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు ఇంకా హర్ష సాయి ఎక్కడున్నాడు అనే విషయాన్ని కనిపెట్టలేక పోతున్నారు. ప్రస్తుతానికి హర్ష సాయి అయితే పరారీలో ఉన్నాడు. ఈ లోపుగానే ఆయన పలువురు యూట్యూబర్ల చేత కావాలని మిత్ర శర్మ మీద దుష్ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశం మీద గతంలో పలువురు ఆరోపణలు కూడా చేశారు. ఇక ఆర్ జే శేఖర్ భాష ఈ బిగ్ బాస్ సీజన్ లో హౌస్ లోకి అడుగుపెట్టి అడుగు పెట్టిన కొద్దిరోజుల్లోనే బయటకు వచ్చేయడం గమనార్హం

Exit mobile version