Site icon NTV Telugu

Hyderabad City Police : హెల్ మేట్ ను దూరంగా ఉంచండి… “కేజీఎఫ్ 2″పై మీమ్

Kgf2

Kgf2

ఇటీవల కాలంలో సజ్జనార్ పుణ్యమాని టీఎస్ ఆర్టీసీకి ఫ్రీగానే కావాల్సినంత ప్రమోషన్లు జరుగుతున్నాయి. సజ్జనార్ “రాధేశ్యామ్”, “ఆర్ఆర్ఆర్” సినిమాల పట్ల ప్రేక్షకులను ఉన్న మేనియాను టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణం గురించి ప్రేక్షకుల్లో అవగాహన కల్పించడానికి ఉపయోగిస్తున్నారు. పలు సినిమా మీమ్స్ తో టీఎస్ ఆర్టీసీ గురించి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా అదే బాటలో నడుస్తూ “కేజీఎఫ్ 2” పవర్ ఫుల్ డైలాగ్ ను వాడేశారు.

Read Also : Will Smith : చెంప దెబ్బ ఎఫెక్ట్ గట్టిగానే… హీరోపై అకాడమీ షాకింగ్ నిర్ణయం

“ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు “హెల్మెట్” తప్పక ధరించండి, సురక్షితంగా మీ గమ్య స్థానాన్ని చేరుకొండి.
ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, ఇతరులకి ఆదర్శంగా నిలుద్దాం” అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానిపై “హెల్మెట్ హెల్మెట్ హెల్మెట్… ఐ డోంట్ లైక్ హెల్మెట్… బట్ హెల్మెట్ సేవ్స్ మీ… ఐ డోంట్ అవాయిడ్ హెల్మెట్” అని ఉంది. “కేజీఎఫ్ 2” ట్రైలర్ లో “వయోలెన్స్… వయోలెన్స్… వయోలెన్స్…. ఐ డోంట్ లైక్ ఇట్… ఐ అవాయిడ్… బట్ వయోలెన్స్ లైక్స్ మీ” అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్. ‘హెల్మెట్ మీ హెల్ మేట్ ను దూరంగా ఉంచుతుంది’ అంటూ రోడ్ సేఫ్టీకి సంబంధించిన సలహా ఇచ్చారు అందరికి. ఏదైతేనేం ప్రజల సేఫ్టీ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం.

Exit mobile version