NTV Telugu Site icon

Shekar Movie: రాజ’శేఖర్’ సినిమాకు షాక్.. ప్రదర్శనలు నిలిపివేత

Shekar Movie

Shekar Movie

యాంగ్రీమెన్ రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కోర్టు ఆదేశించినా రాజశేఖర్ డబ్బు చెల్లించకపోవడంతో ఆయన నటించిన ‘శేఖర్’ ప్రదర్శన నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్‌లోనూ ప్రసారం చేయరాదని కోర్టు పేర్కొంది. దీంతో పలుచోట్ల శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.

Lokesh Kanagaraj: ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫమ్ చేసిన దర్శకుడు

శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేతపై హీరో రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. శేఖర్ చిత్రాన్ని తనతో తన కుటుంబం సర్వస్వంగా భావించిందని.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడినట్లు రాజశేఖర్ తెలిపాడు. ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోందని.. దీంతో కావాలనే కొందరు తమపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు. దీనిపై తాను చెప్పాల్సిందేమీ లేదని.. ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని తాను భావిస్తున్నట్లు రాజశేఖర్ అభిప్రాయపడ్డాడు. కాగా మే 20న విడుదలైన శేఖర్ సినిమాలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ నటించారు. ఈ మూవీలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించింది.

Show comments