Site icon NTV Telugu

Kabzaa: ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా మావా… ‘రోలెక్స్’ రేంజులో రివీల్ చేశావ్

Kabzaa

Kabzaa

లోకనాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి యాక్టింగ్ టాలెంట్ మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి  లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా ‘విక్రమ్’. పాన్ ఇండియా హిట్ గా నిలిచిన ఈ సినిమా రిలీజ్ కి మరో ౭౨ గంటలు ఉంది అనగా, విక్రమ్ సినిమాలో ‘సూర్య’ నటిస్తున్నాడు అంటూ మాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. కోలీవుడ్ సినీ అభిమానులనే కాదు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులని కూడా ఆశ్చర్యపరిచిన అనౌన్స్మెంట్ ఇది. అప్పటివరకూ విక్రమ్ సినిమాపై ఉన్న అంచనాలని అమాంతం పెంచింది ‘సూర్య’ క్యామియో అనౌన్స్మెంట్. హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ లోకి వచ్చిన సినీ అభిమానులకి ‘రోలెక్స్’ పాత్రలో సూర్య కనిపించి సర్ప్రైజ్ చేశాడు. సినిమా మొత్తానికి వచ్చిన రెస్పాన్స్ కేవలం సూర్య ఎంట్రీకే వచ్చింది అంటే ఆ క్యామియో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే రేంజ్ క్యామియో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి, సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. KFI నుంచి భారి బడ్జట్ తో తెరకెక్కి పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి వస్తున్న లేటెస్ట్ సినిమా ‘కబ్జా’.

ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాని చంద్రు డైరెక్ట్ చేస్తున్నాడు. KGF సినిమాని గుర్తు చేసేలా ఉన్న కబ్జా సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి ఆకాశం అంత ఎత్తుకి తీసుకోని వెళ్తూ, కబ్జా సినిమాలో శివన్న నటిస్తున్నాడు అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కన్నడ సూపర్ స్టార్ శివన్న కబ్జా సినిమాలో నటిస్తున్నాడు అనే వార్త బయటకి రాగానే, కబ్జా సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ ఊహించని అనౌన్స్మెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మరి రోలెక్స్ రేంజులో బయటకి వచ్చిన శివన్న క్యామియో అనౌన్స్మెంట్, కబ్జా సినిమాకి ఎంత వరకూ హెల్ప్ అవుతుందో తెలియాలి అంటే మార్చ్ 17 వరకూ ఆగాల్సిందే.

Exit mobile version