NTV Telugu Site icon

Prabhas: ఈ రికార్డు ప్రభాస్ కే సొంతం!

Prabhas Huge Cutout

Prabhas Huge Cutout

Huge Celebrations for Prabhas Birthday at Hyderabad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగగా, హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో ఒక రేంజ్ లో జరిగాయి. కూకట్ పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. ప్రభాస్ భారీ కటౌట్ ను అభిమానులు కైతలాపూర్ గ్రౌండ్స్ లో అభిమానులే ఆవిష్కరించారు. ఆ తరువాత ప్రభాస్ కటౌట్ కు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. టాలీవుడ్ లో ఈ రేంజ్ కటౌట్ ఇప్పటి దాకా ఏ హీరోకి కట్టలేదు, ఏ క్రమంలో ఇది ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డుగానే చెప్పాలి. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు శాస్త్రి, రామకృష్ణ, గోవింద్ తదితరుల సమక్షంలో ఈ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు శాస్త్రి మాట్లాడుతూ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులను చూస్తుంటే హ్యాపీగా ఉందని, ప్రభాస్ సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోనే అన్నారు.

Leo Collections: ఎంత మోసం చేశారు మావా?

ఆయన ఎంత మంచి వారో మనందరికీ తెలుసని పేర్కొన్న ఆయన ప్రభాస్ సలార్ డిసెంబర్ 22న వస్తోందని, ఆ సినిమా మామూలుగా ఉండదు అన్నారు. ఆ రోజు ఇంకా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుందాం అని అన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ ప్రభాస్ కి వాళ్ళ నాన్న సూర్య నారాయణ రాజు, పెదనాన్న కృష్ణం రాజు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని, వాళ్ళు ఎక్కడున్నా ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటారని, ప్రభాస్ తనకు తానుగా స్టార్ గా ఎదిగిన హీరో ఆయన సలార్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయాలన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు గోవింద్ మాట్లాడుతూ ప్రభాస్ స్టార్ డమ్ కు ఇండస్ట్రీలో సాటి లేదని, ఆయన మన అభిమానులను ఎంతగా ప్రేమిస్తారో అందరికీ తెలుసని, ప్రభాస్ కి రాబోయే సినిమాలన్నీ సూపర్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుందామన్నారు.