మేజర్ : “వినవే హృదయమా”… సిద్ శ్రీరామ్ మరో క్లాసిక్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన “మేజర్” చిత్రం విడుదల గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి పాటను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. “హృదయమా” అనే సాంగ్ ను ఈరోజు మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ శ్రావ్యమైన సాంగ్ చాలా రొమాంటిక్ గా, ఉల్లాసంగా ఉంది. లిరికల్ వీడియో సినిమాలోని ప్రేమికుల మధ్య సుదూర సంబంధాన్ని సూచిస్తోంది. ఈ పాట చాలా ఆకర్షణీయంగా ఉంది. రొమాంటిక్ సాంగ్స్ ఇష్టపడే వారి ప్లేలిస్ట్ లో ఈ సాంగ్ టాప్ లో ఉంటుంది. ఈ రొమాంటిక్ సాంగ్ కు కృష్ణ కాంత్, విఎన్వి రమేష్ కుమార్ లిరిక్స్ అందించారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Read Also : కొత్త లుక్ లో పవన్… వెకేషన్ పిక్ వైరల్
Also Read
ఇక దుల్కర్ సల్మాన్ విడుదల చేసిన మలయాళం వెర్షన్ ‘పొన్ మలారే’ పాటకు కూడా సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది. మలయాళంలో ఐరాన్ ఈ పాటను పాడారు. “మేజర్”లో సాయి మంజ్రేకర్, శోబితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!