కొత్త లుక్ లో పవన్… వెకేషన్ పిక్ వైరల్

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వెకేషన్ నుంచి తిరిగొచ్చిన పవన్ తాజాగా హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్టులో ఆయన వస్తున్న వీడియోను తీసిన ఓ అభిమాని ట్విట్టర్ షేర్ చేయగా, ఇప్పుడది ట్రెండ్ అవుతోంది. అందులో పవన్ బ్లాక్ కలర్ టీ షర్ట్, జీన్స్ ధరించారు. ఇక పవన్ వెకేషన్ విషయానికొస్తే… ‘భీమ్లా నాయక్’ వాయిదా పడడంతో రష్యా విహారయాత్రకు వెళ్లారు పవన్. అక్కడ ఆయన భార్య అన్నా లెజ్నెవా, పిల్లలతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. కోవిడ్ కంటే ముందే పవన్ భార్యా, పిల్లలు రష్యాకు వెళ్లారు. ఇప్పుడు పవన్ కూడా అక్కడికే వెళ్లి, కుటుంబంతో కలిసి క్రిస్మస్, న్యూఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు.

Read Also : ఏపీ సీఎం జగన్ కు ఆర్జీవీ హెచ్చరిక

ఇక సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న పవన్ కొత్త చిత్రం “భీమ్లా నాయక్” సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా, ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ ఇండియా సినిమాల కోసం వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఆ రెండు సినిమాలు కూడా కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు. పవన్ ఒకవైపు సినిమాలు, మరోవైపు పాలిటిక్స్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ విరామం లేకుండా పని చేస్తున్నారు.

Related Articles

Latest Articles