Site icon NTV Telugu

Gehraiyaan : అమెజాన్ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా ?

gehraiyaan

దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన అర్బన్ రోమ్ కామ్ “గెహ్రైయాన్”. తాజాగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. “గెహ్రైయాన్” ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. అయితే టీజర్ తో తీవ్ర దుమారం రేపిన ఈ రొమాంటిక్ డ్రామాకు రిలీజ్ అయ్యాక మాత్రం మంచి స్పందన వచ్చింది. పెళ్లి తరువాత ఇలాంటి సీన్లలో నటించడం ఏంటి అంటూ విమర్శలు ఎదుర్కొన్న దీపిక నటనకు ప్రశంసలు దక్కాయి.

Read Also : AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు

తాజా అప్‌డేట్ ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసిందట. 2022లో “గెహ్రైయాన్‌” డైరెక్ట్ డిజిటల్ విడుదల హక్కుల కోసం అమెజాన్ ఏకంగా 100 కోట్ల రూపాయలను వెచ్చించిందని తెలుస్తోంది. భారతీయ OTT స్పేస్‌లో ఇది అతిపెద్ద డీల్స్ లో ఒకటని చెప్పొచ్చు. “గెహ్రైయాన్” మానవ సంబంధాలు, ప్రేమ, స్నేహం, ద్రోహం వంటి సంక్లిష్ట మానవ మనోభావాలకు సంబంధించిన కథ. మూవీలో కథ నలుగురి జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో దీపికా పదుకొణే అలీషాగా, అనన్య పాండే థియాగా, సిద్ధాంత్ చతుర్వేది జైన్ అనే పాత్రల్లో కన్పించారు. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్కా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Exit mobile version