Site icon NTV Telugu

RRR : డబ్బింగ్ కోసం తారక్ ఎన్ని రోజులు తీసుకున్నాడంటే ?

RRR

RRR సినిమా విడుదలకు సర్వం సిద్ధంగా ఉంది. దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో RRR ప్రమోషన్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరుగుతున్న ఇంటర్వ్యూలలో ‘ఆర్ఆర్ఆర్’ టీం సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో డైలాగ్ పోర్షన్ చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దానికి తోడు ఎన్టీఆర్ తన తెలుగు డబ్బింగ్ పూర్తి చేయడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే పట్టిందని చెప్పాడు. హిందీకి రెండు రోజులు, తమిళ్ డబ్బింగ్ కోసం మూడు రోజులు తీసుకున్నాడని వెల్లడించారు.

Read Also : RRR : మరో రికార్డు… సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ ఎక్కువ !?

RRR భారీ యాక్షన్ ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అవుతోంది. ఇక దేశవ్యాప్తంగా RRR ప్రమోషనల్ టూర్ ను పూర్తి చేసుకున్న టీం ఇప్పుడు ఇంటికి చేరుకుంది. కాగా స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Exit mobile version