Site icon NTV Telugu

Bollywood : ప్రైవేట్ ఆల్బమ్స్ తో నెట్టుకొస్తున్న హాట్ బ్యూటీ

Jaqalinefernandez

Jaqalinefernandez

శ్రీలంక నుండి బాలీవుడ్‌లోకి ఇంపోర్టైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హిట్ సౌండ్ విని ఏడేళ్లవుతుంది. రేస్ 3 తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. ఓవైపు హీరోయిన్ మరో వైపు ఐటమ్ గర్ల్‌గా రెండు చేతుల సంపాదిస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ఇవి చాలవన్నట్లు ఆ మధ్య సుకేష్ చంద్ర శేఖర్, మనీలాండరింగ్ కేసులు ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే పలకరిస్తున్నాయి. ఇలా కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో ఆమెను ఆదుకుంటున్నాయి ప్రైవేట్ సాంగ్స్.

Also Read : DVV : OG పై అవన్ని పుకార్లే.. ఆయన రావడం పక్కా

రామ్ సేతు, సర్కస్ చిత్రాల తర్వాత పెద్దగా ఆఫర్స్ లేని టైంలో ఇమ్మి ఇమ్మి సాంగ్ చేసి మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది జాక్వెలిన్. ఆ తర్వాత ఫతె, హౌస్ ఫుల్ 5లో హీరోయిన్ రోల్స్ చేసినా పెద్దగా కలిసి వచ్చిందీ లేదు. రైడ్2 లో స్పెషల్ సాంగ్ చేస్తే ఈమె కన్నా తమన్నా పాటకే పాపులారిటీ వచ్చింది. మెయిన్ లీడ్స్ చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతుండగా ఐటమ్ సాంగ్స్ చేస్తున్న చిత్రాలు సక్సెస్ కొడుతున్నప్పటికీ క్రెడిట్ మరొకరి ఖాతాలో చేరిపోతున్నాయి. కానీ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో అరేబియన్ హార్స్‌ని నిలబెట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తున్నాయి. గతంలో ఏడాదికి లేదా రెండేళ్లకు ఓసారి ప్రైవేట్ ఆల్బమ్‌లో మెరిసే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ ఏడాది అప్పుడే రెండు మ్యూజిక్ ఆల్బమ్స్‌ను తీసుకువచ్చింది. టిక్ టిక్‌తో పాటు రీసెంట్లీ దమ్ దమ్ అనే సాంగ్ దింపింది గ్లామరస్ బ్యూటీ. సినిమాల కన్నా మ్యూజిక్ ఆల్బమ్స్‌తో క్రేజ్, ఆఫర్లను తెచ్చిపెట్టడంతో వాటిపై ఫోకస్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ప్రజెంట్ మిస్ శ్రీలంక చేతిలో వెల్కమ్ టు ది జంగిల్ తప్ప మరో మూవీ లేదు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. ఈ లోగా మరికొన్ని స్పెషల్ సాంగ్స్ రిలీజ్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version