Site icon NTV Telugu

Boys Hostel : తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’

Boys Hostel Movie

Boys Hostel Movie

Hostel Hudugaru Bekagiddare Movie Dubbed in to telugu: అంతకు ముందు ఇతర భాషల సూపర్ హిట్ సినిమాలను కన్నడలో రీమేక్ చేసుకునే వారు కానీ గత కొన్నేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల్లోకి డబ్, రీమేక్ అవుతున్నాయి. నిజానికి ఒకప్పుడు కన్నడ సినీ దర్శకనిర్మాతలు సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారని కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన కన్నడ మిశ్రమ ఇప్పుడు ఔరా అనే సినిమాలు చేస్తూంది. కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్‌ రోణ లాగా కొత్తదనం ఉట్టిపడేలా సినిమాలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పుడదే తరహాలో మరో సినిమా తెలుగులో సంచలనాలు సృష్టించడానికి సిద్ధం అవుతోంది. అస్లు విషయం ఏమిటంటే ఈమధ్య కాలంలో హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే అనే సినిమా కన్నడ ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.

Ashu Reddy: వైట్ మినీ స్కర్ట్ డ్రెస్సులో అదరహో అనిపిస్తున్న అషు రెడ్డి

రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించగా మూడువారాల కిందట కన్నడలో రిలీజై భారీ ఎత్తున వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాను తెలుగులో బాయ్స్‌ హాస్టల్‌ పేరుతో రిలీజ్‌ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. అన్నపూర్ణ స్డూడీయోస్‌, చాయ్‌ బిస్కెట్‌ సంస్థలు సమర్పిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అంతా ఒకే హాస్టల్‌ లో జరుగుతుంది. ఓ రోజును హఠాత్తుగా హాస్టల్‌లో వార్డెన్ శవం దొరకగా ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేదే ఈ సినిమా కథ. నిజానికి కన్నడలో రిలీజ్ అయినప్ప్పుడు మొదటి రోజు కోటీ షేర్‌ కూడా రాబట్టని ఈ సినిమా మౌత్‌ టాక్‌ పాజిటీవ్‌ రావడంతో కలెక్షన్‌ల వర్షం కురుస్తోంది. తెలుగులో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

Exit mobile version