Site icon NTV Telugu

కాసేపట్లో గుండె మార్పిడి! అంతలోనే డ్యాన్స్ పార్టీ!

Hospital staff dance to BTS' Dynamite for die hard fan awaiting heart transplant

ఆర్మీ అంటే మనం ఇండియన్ ఆర్మీ అనుకుంటాం. మనమే కాదు, ఎవరి దేశంలో వారు తమ సైన్యాన్ని ఆర్మీ అనే అంటారు. కానీ, ఇప్పుడు దేశాలు, సరిహద్దులు అంటూ ఏమీ లేని ఓ ఆర్మీ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. అదే ‘బీటీఎస్’ ఆర్మీ!

కొరియన్ పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. వారు తమని తాము ‘ఆర్మీ’ అంటూ పిలుచుకుంటారు. అయితే, కేవలం తమ ఫేవరెట్ సింగర్స్ పాటల్నిమెచ్చుకోవటం, ఆన్ లైన్ లో ప్రమోట్ చేయటం మాత్రమే కాకుండా ‘ఆర్మీ’ ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఉంటుంది. తాజాగా ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో బీటీఎస్ అభిమానులు ‘డైనమైట్’ సాంగ్ కు స్టెప్పులు వేశారు!

Read Also : కంగనా హాట్ హాట్ ఫోజులు!

అమెరికాలోని ఓ ఆసుపత్రిలో ఒకామె హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స పొందాల్సి ఉంది. అత్యంత క్లిష్టమైన ఆ ఆపరేషన్ అంటే ఎవరైనా మానసిక ఒత్తిడికి లోనవుతారు కదా! సదరు పేషెంట్ పరిస్థితి కూడా అదే. అయితే, ఆమె బీటీఎస్ బ్యాండ్ కి డై హార్డ్ ఫ్యానట! ఆ విషయం తెలుసుకున్న హాస్పిటల్ స్టాఫ్ తమ ప్రొటోకాల్స్ అన్నీ పక్కన పెట్టి హార్ట్ పేషెంట్ కి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు! డాక్టర్లు, నర్సులు ‘డైనమైట్’ సాంగ్ కి స్టెప్పులు గుండె మార్పిడి చికిత్సకి వెళ్లాల్సిన రోగిని ఆనందంలో ముంచెత్తారు!

బీటీఎస్ అభిమాని అయిన పేషెంట్ కోసం డ్యాన్స్ చేసింది కూడా కే-పాప్ బ్యాండ్ తాలూకూ ఫ్యాన్సేనట! వారంతా ‘ఆర్మీ’లో భాగం! అందుకే, రోగిని ప్రేమతో ఉత్సాహపరచాలనే సంకల్పంతో స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు! ఆన్ లైన్ లో ఇప్పుడు ఈ బీటీఎస్ హాస్పిటల్ డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది…

Exit mobile version