Site icon NTV Telugu

Honeymoon Express: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ లో రొమాంటిక్ గా ‘ప్రేమ’

Honeymoon Express Song

Honeymoon Express Song

Honeymoon Express Second Song Released: ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. తనికెళ్ల భరణి – సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి బాల రాజశేఖరుని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించగా కల్యాణి మాలిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్వరపరిచిన మరో రొమాంటిక్ పాట ‘ప్రేమ’ ను బాహుబలి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేసి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆ అందమైన ప్రేమ గీతానికి అనురాగ్ కులకర్ణి తన గాత్రం అందించారు. ఇక ఈ క్రమంలో సినీ ప్రముఖులు ఆర్ పి పట్నాయక్, గోపి మోహన్, చైతన్య ప్రసాద్, రవి వర్మ తదితరులు ప్రత్యక్షంగా, ఆస్కార్ అవార్డు విజేత ఎమ్ ఎమ్ కీరవాణి, అవసరాల శ్రీనివాస్, ఇంద్రగంటి మోహన కృష్ణ వీడియో కాల్స్ తో తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కీరవాణి కల్యాణి మాలిక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇటీవల విడుదల అయిన నిజమా పాట అద్భుతంగా ఉంది, యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది అని కొనియాడి ఇప్పుడు రెండో పాట ‘ప్రేమ’ కి మరింత ఆదరణ లభించాలని ఆశీర్వదించారు.

Exit mobile version