Site icon NTV Telugu

భార్య ఆరోపణలపై స్పందించిన హనీ సింగ్

Honey Singh breaks silence on domestic violence allegations by wife Shalini Talwar

గత రెండ్రోజులుగా బాలీవుడ్ ప్రముఖ గాయకుడు యో యో హనీ సింగ్ పై ఆయన భార్య చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తోంది. ఆయన భార్య షాలినీ తల్వార్ అతనిపై గృహ హింస కేసు పెట్టడమే కాకుండా పలు ఆరోపణలతో 10 కోట్లు డిమాండ్ చేయడం చర్చనీయంశంగా మారింది. తాజాగా హనీ సింగ్ ఆమె ఆరోపణలను ఖండిస్తూ సుదీర్ఘ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన భార్య చేస్తున్న ఆరోపణలు అబద్ధమని, ఆమె తమ కుటుంబం పరువు తీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అన్నారు. “నేను గతంలో ఎప్పుడూ ప్రెస్ నోట్ జారీ చేయలేదు. చాలాసార్లు నా గురించి మీడియాలో తప్పుగా కవరేజ్ జరిగింది. అయినా కూడా నేను మాట్లాడలేదు. కానీ ఈసారి నా కుటుంబం గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది.

Read Also : రాజ్ కుంద్రా కేసు : 8 గంటల పాటు షెర్లిన్ చోప్రా విచారణ

నేను గత 15 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో పని చేస్తున్నాను. ఎంతోమంది స్టార్ హీరోలతో , మ్యూజిక్ డైరెక్టర్స్ తో పని చేశాను. వాళ్లందరికీ నా భార్యతో నేను ఎలా ఉంటానో తెలుసు. గత దశాబ్ద కాలంగా నా భార్య కూడా నా సిబ్బందిలో ఒక భాగంగా ఉంటోంది. దీనితో పాటు ఆమె నాకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌లు, షూటింగ్‌లు, మీటింగ్‌లలో నాతో పాటే వచ్చేది. ఈ విషయం ఇప్పుడు కోర్టులో ఉంది. అందుకే దాని గురించి మాట్లాడనుకోవట్లేదు. ఈ దేశ న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సమయంలో అభిమానులు నా గురించి ఎలాంటి తప్పు తీర్మానాలు చేయకూడదని కోరుకుంటున్నాను. న్యాయం జరుగుతుందని, నిజం గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. నా అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, సపోర్ట్ కు నేను కృతజ్ఞుడను” అంటూ హనీ సింగ్ ప్రెస్ నోట్ లో రాసుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Yo Yo Honey Singh (@yoyohoneysingh)

Exit mobile version