Honey Rose : సెల్ఫీ ఇస్తుండగా హీరోయిన్’ను అక్కడ పట్టుకున్న అభిమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ కుట్టి, టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హనీ రోజ్ కు అనూహ్యమైన రీతిలో ఒక చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళిన ఆమెపై, అభిమానుల ముసుగులో కొందరు వ్యక్తులు అతిగా ప్రవర్తించడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. కేరళలో కొత్తగా ప్రారంభమైన ఒక భారీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌కు హనీ రోజ్ హాజరయ్యారు, ఆమెను చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ప్రారంభంలో అంతా సజావుగానే సాగినా, ఒక్కసారిగా అభిమానులు సెల్ఫీల కోసం ఆమె చుట్టూ చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది.
Also Read : Hema: హేమకు క్లీన్ చీట్.. చనిపోవాలి అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్!
Also Read
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
సెల్ఫీ తీసుకునే క్రమంలో కొందరు వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆమెకు అతి దగ్గరగా రావడమే కాకుండా, ఏకంగా ఆమె నడుమును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి లోనైన హనీ రోజ్, అక్కడికక్కడే షాక్‌కు గురయ్యారు. తనను ఇబ్బంది పెడుతున్నారని గ్రహించిన హనీ రోజ్, వెంటనే ఆ సెల్ఫీ పిచ్చిగాళ్ళ నుంచి దూరంగా జరిగి అక్కడి నుండి నిష్క్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సినిమా తారలను చూడాలనే ఆరాటం ఉండొచ్చు కానీ, అది అరాచకత్వానికి దారి తీయకూడదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో కూడా రాజాసాబ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ కు సైతం ఇలాంటి చెడు అనుభవమే ఎదురైంది. ఆమెను తాకేందుకు అభిమానులు ప్రయత్నించారు.
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?