NTV Telugu Site icon

Honey Rose : నా బాడీ షేప్ గురించి వాడు నోటికి వచ్చినట్లు వాగుతుంటే.. నవ్వారు

Honew

Honew

Honey Rose : మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ కుర్రకారును ఒక్క సాంగ్ తో ఊపేసిన బ్యూటీ హనీ రోజ్. వీరసింహారెడ్డి సినిమాతో తెలుగులో మరింత క్రేజ్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతకుముందు తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు. కానీ, వీరసింహారెడ్డి లో ఒక సాంగ్ చేసిందో లేదో ఏమండీ రేంజ్ మారిపోయింది. అయితే అంత రేంజ్ ఉన్నా కూడా అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది ఈ చిన్నది. కాగా, హనీ రోజ్ చాలాసార్లు తన బాడీ వలన ఎన్నో ఇబ్బందులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె .. కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు చాలా చోట్ల బాడీ షేమింగ్ కు గురైనట్లు చెప్పుకొచ్చింది. ఆ ట్రోలింగ్ ను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నట్లు తెలిపింది.

Ram Charan: బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం.. చరణ్ ట్వీట్ వైరల్

” నేను కెరీర్ మొదట్లో ఒక టీవీ షోకు వెళ్ళాను. అక్కడ ఆ షో చూడడానికి వచ్చిన ఒకడు.. నా బాడీ గురించి చెత్త వాగుడు వాగాడు. అతను అలా నోటికి వచ్చినట్లు వాగుతుంటే.. ఆ షో యాంకర్ పగలబడి నవ్వుతున్నాడు. ఆ సమయంలో నాకు చాలా బాధగా అనిపించింది. కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తాయి.. మరికొన్ని మనసుకు చాలా బాధను కలిగిస్తాయి. ఇప్పుడిప్పుడే నేను వాటినుంచి బయటపడుతున్నాను. ఇలాంటి ట్రోల్స్ ను పట్టించుకోవడం మానేశాను. ఒకప్పుడు హీరోయిన్స్ బరువు పెరిగినా ఏమి అనేవారు కాదు.. కానీ, ఇప్పుడు లావెక్కింది, బండలా మారింది అంటూ సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు.. అలాంటి మాటలు విన్నప్పుడే బాధగా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలు విన్న తరువాత ఆమె అభిమానులు.. ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. మీరు చాలా అందంగా ఉంటారని, అలాంటి ట్రోల్స్ ను పట్టించుకోవద్దని చెప్పుకొస్తున్నారు.