Site icon NTV Telugu

Devara: దేవర యూనిట్ పై తేనెటీగల దాడి…. హాస్పిటల్ లో 20 మంది ఆర్టిస్టులు?

Devara News

Devara News

Honey Bees attacked Junior Artists at Devara Shooting: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఆచార్య అనే భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరి దృష్టి సినిమా మీదే ఉంది. దానికి తోడు రాజమౌళితో చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకైనా అపజయం తప్పదు అనే ఒక సెంటిమెంట్ ఉండటంతో దాన్ని ఈసారి ఎలాగైనా తొలగించాలని ఉద్దేశంతో చాలా కష్టపడుతోంది సినిమా యూనిట్. ఈ దేవర సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మేరకు షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు.

Satya:ఏఎల్ విజయ్ మేనల్లుడు హీరోగా ప్రేమలు డైరెక్టర్ కూతురి సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్!

ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉండగా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ సహా మరి కొంతమంది మీద ప్రస్తుతం సీన్స్ షూట్ చేస్తున్నారు. తాజాగా ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా షూటింగ్ స్పాట్లో ఉన్న ఒక తేనె తుట్ట కదలడంతో తేనెటీగలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. షూటింగ్లో ఉన్న 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టుల మీద తేనెటీగలు దాడి చేసినట్లుగా చెబుతున్నారు. వారికి తీవ్ర గాయాలు అవడంతో ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రదేశంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకుండా సినిమా యూనిట్ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Exit mobile version