Site icon NTV Telugu

Hombale Films: KGF 3 వస్తోంది… షాక్ ఇచ్చిన మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్

Hombale Films

Hombale Films

హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఏ రేంజులో ఉండాలి, కమర్షియల్ సినిమాలో కూడా సెంటిమెంట్ ని ఎలా బాలన్స్ చెయ్యాలి, అసలు మాస్ సినిమాకి కొలమానం ఏంటి? అంటే అన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘KGF’ ఫ్రాంచైజ్. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న ప్రశాంత్ నీల్, రాఖీ భాయ్ అనే ఐకానిక్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ‘KGF 1&2’ సినిమాలని తెరకెక్కించాడు. ఓవరాల్ గా రెండు సినిమాలు కలిపి 1500 కోట్లకి పైగా రాబట్టాయి అంటే KGF ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాఖీ భాయ్ క్యారెక్టర్ కి, యష్ స్టైల్ అండ్ స్వాగ్ కి పాన్ ఇండియా ఆడియన్స్ ఫిదా అయిపోయారు. పార్ట్ 2 ఎండ్ లో రాఖీ భాయ్ సముద్రంలోకి వెళ్లి అక్కడ నీళ్లలోకి పడిపోయినట్లు, ఆల్మోస్ట్ చనిపోయినట్లు ప్రశాంత్ నీల్ చూపించాడు. ఇండియన్ సినిమా లవర్స్ అమితంగా ప్రేమించిన రాఖీ భాయ్ క్యారెక్టర్ కి ‘ఎండ్ కార్డ్’ పడిందా అని థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్న సమయంలోనే, పోస్ట్ క్రెడిట్స్ సీన్ లో KGF 3 హింట్ ఇచ్చి గూస్ బంప్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. KGF 3 వస్తుంది అని ఎండ్ స్క్రీన్ లో కనిపించగానే థియేటర్స్ ఎరప్ట్ అయ్యాయి.

సినీ అభిమానులంతా KGF 3 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటే… KGF 2 రిలీజ్ అయిన సరిగ్గా వన్ ఇయర్ కి KGF 3 గురించి ఊహించని అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్మ్ మేకర్స్. KGF 2 స్పెషల్ వీడియోని రిలీజ్ చేసిన మేకర్స్, ఎండ్ లో ఒక ప్రామిస్ చేసాం, ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటాం అని అర్ధం వచ్చేలా హింట్ ఇచ్చారు. దీంతో KGF 3 ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలో మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ రెండు భాగాలుగా చేస్తున్నాడు, ఈ ప్రాజెక్ట్ అయ్యాక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కమిట్మెంట్ ఉంది. ఈ రెండు సినిమాలకి మరో మూడేళ్లు అయినా పడుతుంది, సో KGF 3 సినిమాని ప్రశాంత్ నీల్ ఇప్పట్లో చేసే అవకాశమే కనిపించట్లేదు. ఎప్పుడు వస్తుంది అనే విషయం పక్కన పెడితే, KGF 3 ఎప్పుడు వచ్చినా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం, ముందెన్నడూ చూడని మాస్ హిస్టీరియాని క్రియేట్ చెయ్యడం అయితే గ్యారెంటీ.

Exit mobile version