Site icon NTV Telugu

Hombale Films: ఈ సమయంలో ఈ ట్వీట్ అవసరమా దొర?

Hombale Films

Hombale Films

డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది సలార్ రిలీజ్ ట్రైలర్. ఈ ఒక్క ట్రైలర్ దెబ్బకి సలార్ హైప్ ఆకాశాన్ని తాకింది. రిలీజ్ డేట్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో హోంబలే అన్ని సెంటర్స్ లో టికెట్ రేట్స్ ని ఫిక్స్ చేసి బుకింగ్స్ ఓపెన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది. సలార్ టికెట్స్ ఆ సెంటర్ లో ఓపెన్ అయ్యాయి, ఈ సెంటర్ లో ఓపెన్ అయ్యాయి, రిలీజ్ ట్రైలర్ ఇన్ని వ్యూస్ తెచ్చుకుంది అంటూ హోంబలే ఫిల్మ్స్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ట్వీట్స్ వస్తున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికైనా యాక్టివ్ మోడ్ లోకి వచ్చిందిలే అనుకుంటున్నారు. అయితే హోంబలే ప్లాన్స్ మాత్రం వేరేలా ఉన్నాయి. సలార్ హైప్ ని వాడుకుంటూ తమ ఇతర సినిమాలని కూడా ప్రమోట్ చేసుకుంటున్నాయి.

సలార్ కి సంబంధించిన ట్వీట్స్ కోసం సినీ అభిమానులు హోంబలే ఫిల్మ్స్ ని ఫాలో కొట్టి ఉంటారు. రిలీజ్ ఇంకో మూడు రోజుల్లోనే ఉంది కాబట్టి ఈ క్యూరియాసిటీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే హోంబలే ఫిల్మ్స్ మాత్రం సోషల్ మీడియాలో తమ ప్రొడక్షన్ లో భవిష్యత్తులో రిలీజ్ కాబోయే సినిమాల అప్డేట్స్ ని కూడా ఇప్పుడే ఇచ్చేస్తోంది. ఇటీవలే భగీర టీజర్ ని రిలీజ్ చేసారు హోంబలే ఫిల్మ్స్. సరేలే ఆ రోజు హీరో శ్రీమురళి బర్త్ డే కదా అనుకుంటే కొత్తగా కీర్తి సురేష్ నటిస్తున్న “రఘు తాత” సినిమా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఎలాంటి అకేషన్ లేదు, షూటింగ్ కంప్లీట్ కూడా ఎప్పుడో అయిపొయింది, డబ్బింగ్ స్టార్ట్ అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వలేదు… ఇలా అసలు ఎలాంటి అకేషన్ లేకుండా సడన్ గా ఇప్పుడు రఘుతాత త్వరలో రిలీజ్ అవ్వబోతుంది అంటూ హోంబలే ఫిల్మ్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న నెక్స్ట్ సినిమా రఘుతాత త్వరలో రిలీజ్ కాబోతుంది అంటూ ట్వీట్ వచ్చింది. రిలీజ్ డేట్ అయినా చెప్పకుండా త్వరలో రిలీజ్ అవుతుంది అంటూ రఘుతాత అప్డేట్ ని ఎందుకు ఇచ్చారో హోంబలే ఫిల్మ్స్ కే తెలియాలి.

Exit mobile version