NTV Telugu Site icon

Prabhas Fans: సలార్ మళ్లీ డిజప్పాయింట్… ప్రభాస్ ఫ్యాన్స్ కే ఇలా ఎందుకు జరుగుతుందో?

Prabhas Fans

Prabhas Fans

ఫైనల్‌గా బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ మూవీ వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని అనుకున్నారు కానీ సలార్ ఫైనల్ కలెక్షన్స్ 700 నుంచి 800 కోట్ల మధ్యలోనే ఆగిపోయేలా ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెచ్ రీచ్ అవడంతో పాటు… నైజాం వంటి ఏరియాల్లో మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయినా కూడా ఇప్పటి వరకు మేకర్స్ కనీసం సక్సెస్ సలెబ్రేషన్స్ కూడా చేయలేదు. ప్రమోషన్స్ విషయంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని సలార్ మేకర్స్… సక్సెస్ విషయంలోను అదే ఫాలో అయ్యారు. ఒక్క చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. సక్సెస్‌ మీట్‌లో అయిన ప్రభాస్ బయటికి వస్తాడు అనుకుంటే… సైలెంట్‌గా కానిచ్చేశారు. సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో… చిత్ర యూనిట్ చిన్న సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్‌తో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాల్గొన్నారు.

సలార్ సినిమా బ్లాక్ థీమ్‌లో తెరకెక్కడంతో… ఈ సక్సెస్ పార్టీలో అందరూ కూడా బ్లాక్ డ్రెస్‌లోనే కనిపించడం విశేషం. ప్రభాస్, పృథ్వీరాజ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సలార్ సక్సెస్‌ని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసేసుకున్నారు. అదుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో ప్రభాస్ బ్లాక్ అండ్ బ్లాక్‌లో చాలా కూల్‌గా కనిపించాడు కానీ… ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఎలాగూ… సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు… కనీసం సక్సెస్ మీట్ అయిన గ్రాండ్‌గా చేస్తారని ఫ్యాన్స్ భావించారు కానీ ఇప్పుడు ఇలా సింపుల్ చేసేసి డార్లింగ్ అభిమానులను నిరాశ పరిచారు. ఏదేమైనా… సలార్ హిట్ అయింది కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు.