ప్రపంచంలో అత్యంత్య పెద్ద సినీ పరిశ్రమ ఏదంటే ఏమాత్రం థముడుకోకుండా హాలీవుడ్ అని చెబుతాం. ప్రపంచం నలుమూలల ఉన్న నటీనటుల హాలీవుడ్ లో ఒక్కసారైనా మెరవాలని కలలు కంటారు. అలాంటిది ఓ హాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం బాలీవుడ్ లో నటించాలని ఆశ పడుతున్నాడు. హాలీవుడ్ కండల వీరుడు డ్వేన్ జాన్సన్ కు హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన ఇతడి సినిమా “రెడ్ నోటీస్”కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. డ్వేన్ జాన్సన్ ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సినిమా నుండి ఆఫర్ రాలేదని, భవిష్యత్తులో వస్తే దాని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. డ్వేన్‌కు భారతదేశంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు వీరాభిమానులున్నారు. మరి ఆయన మాటలను మేకర్స్ పరిగణలోకి తీసుకుని ఇండియా సినిమాల్లో నటించాలన్న డ్వేన్ తపనను, కోరికను తీరుస్తారేమో చూడాలి.
Read Also : రియల్ చినతల్లికి సూర్య సూపర్ హెల్ప్… అసలైన ‘జై భీమ్’పై ప్రశంసలు
