వరల్డ్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరో అనగానే ప్రతి ఒక్కరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగెర్’. టెర్మినేటర్, కెనాన్ ది బార్బేరియన్, కమాండో, ప్రిడేటర్, లాస్ట్ యాక్షన్ హీరో లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఆర్నాల్డ్. రాక్ సాలిడ్ ఫిజిక్ తో పర్ఫెక్ట్ యాక్షన్ హీరోలా ఉండే ఆర్నాల్డ్ కి ఇండియాలో కూడా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడంటే సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ కావలసినన్ని వచ్చేసాయి, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా ఫోన్ లో చూసేయ్యోచు కాబట్టే ఇతర ఇండస్ట్రీల హీరోలకి కూడా ఫాన్స్ ఉన్నారు. ఇవేమీ లేని టైంలోనే ఆర్నాల్డ్ అనే హీరో ఇండియాలో సూపర్ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు అంటే అతనికి అప్పట్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. లిటరల్లీ మాన్ మేడ్ మెషిన్ లా, ఒక స్టన్ గన్ పట్టుకున్న ఇంకో గన్ లా ఉండే ఉంటాడు ఆర్నాల్డ్. ఇప్పటికీ ఎదో ఒక జిమ్ లో ఆర్నాల్డ్ ఫోటోస్ ని పెట్టుకోని ఏక్సర్సైజ్ లు చేసే వాళ్లు ఉన్నారు అంటే ఫిజికల్ ఫిట్నెస్ పైన, యూత్ లో ఆర్నాల్డ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి సూపర్ స్టార్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సినిమాలు చెయ్యడం తగ్గించేసాడు. 2019 తర్వాత ఆర్నాల్డ్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ యాక్షన్ సూపర్ స్టార్ మళ్లీ నటించడానికి రెడీ అయ్యాడు. సినిమా కాకుండా వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ముందుకి వస్తూ ఆర్నాల్డ్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఫుబార్’.
నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ సీరీస్ ని ‘నిక్ శాంటోరా’ క్రియేట్ చేశాడు. ఇందులోని ఫస్ట్ ఎపిసోడ్ ని అబ్రహం డైరెక్ట్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్ల వెబ్ సీరీస్ గా బయటకి రానున్న ఫుబార్, మే 25 నుంచి టెలికాస్ట్ కానుంది. మరో నెల రోజుల్లోనే ప్రీమియర్ ఉండడంతో నెట్ఫ్లిక్స్ ‘ఫుబార్’ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. లూక్ మరియు ఎమ్మా అనే తండ్రి కూతుర్లు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతూ ఉంటారు. ఇద్దరూ CIA కోసమే వర్క్ చేస్తున్నారు అనే విషయం ఒకరి నుంచి ఒకరు దాచిపెడతారు. ఒకానొక సమయంలో ఈ విషయం బయట పడడంతో, ఇన్ని రోజులు ఒకరి గురించి ఒకరికీ తెలుసు అనుకుంటూ ఉన్నాం కానీ ఎవరి గురించి ఎవరికీ ఏమీ తెలియదు అనే విషయం లూక్ అండ్ ఎమ్మాకి అర్ధమవుతుంది. ఇక్కడి నుంచి ఫుబార్ ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్ గా మారింది. తండ్రి కూతురి మధ్య ట్రాక్ ఫన్నీగా ఉంటూనే యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. ఒక తండ్రిగా, CIA ఆఫీసర్ గా ఆర్నాల్డ్ సూపర్బ్ గా ఫిట్ అయ్యాడు. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన సీరీస్ గా రానున్న ఫుబార్ ఆర్నాల్డ్ కి ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి.