Site icon NTV Telugu

NANI : హిట్ 3.. డిస్ట్రిబ్యూటర్స్ కి డేంజర్ బెల్స్..

Hit3

Hit3

నేచురల్‌స్టార్‌ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నాని నటిస్తూ నిర్మించాడు. మే 1న భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన హిట్ 3 హిట్ అనే టాక్ అయితే రాబట్టింది. కానీ వైలెన్స్ ఎక్కువగా ఉంది అనే మాట వినిపించింది. పబ్లిక్ హాలిడే రోజు వచ్చిన ఈ సినిమా రూ. 43 కోట్లతో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకుంది.

Also Read : Tollywood : నిర్మాణ రంగంలో కోట్లు కుమ్మరిస్తున్న ఆడియో కంపెనీలు

ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన నాలుగు రోజులకు గాను రూ. 101 కోట్లు సాధించినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కాస్త వివరంగా పరిశీలిస్తే  బ్రేక్ ఈవెన్ కు పోరాడాల్సి వచ్చేలా ఉంది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో సాలిడ్ కలెక్షన్స్ తో రూ. 11 కోట్లతో బ్రేక్ ఈవెన్ కంప్లిట్ చేసుకుంది. కానీ ఆంధ్రలో పరిస్థితి కాస్త వేరుగా ఉంది. ఉత్తరాంధ్ర బ్రేక్ ఈవెన్ కు చేరుకోగా ఈస్ట్ లో కాస్త వెనకబడింది. అక్కడ బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే సాలిడ్ రన్ కావాలి. వెస్ట్ లోను దాదాపు అదే పరిస్థితి. ఇక కృష్ణలోను బ్రేక్ ఈవెన్ కు చేరుకునేందుకు పోరాడుతుంది ఈ సినిమా. విజయవాడ లాంటి సెంటర్ లో ఆదివారం నాడు హౌస్ ఫుల్స్ పడలేదంటే ఫ్యామిలీస్ ఈ సినిమాకు కాస్త దూరంగా ఉన్నారనే చెప్పాలి. గుంటూరు కూడా నెమ్మదించింది హిట్ 3. అయితే ఫైనల్ రన్ లో మెరుగైన కలెక్షన్స్ రాబట్టి హిట్ స్టేటస్ కు చేరుకుంటుందని ట్రేడ్ భావిస్తోంది. మే 9న శ్రీ విష్ణు సింగిల్ మంచి టాక్ వస్తే హిట్ 3 కలెక్షన్స్ పై ప్రభావం చూపే ఛాన్స్ లేకపోలేదు.

Exit mobile version