HISFF : హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సినీ వేడుకకు వేదిక కానుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ (HISFF) వెబ్‌సైట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు, ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..హైదరాబాద్‌కు ఉన్న సినీ గుర్తింపును మరింత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఉద్దేశ్యం అని అన్నారు.
China’s 3rd Aircraft: అమెరికాకు సవాల్ విసిరిన చైనా! మూడో యుద్ధ నౌక ప్రవేశం..
షార్ట్ ఫిలిం మేకర్లకు ఇది తమ ప్రతిభను ప్రపంచానికి చూపించే గొప్ప వేదిక అవుతుందన్నారు దిల్ రాజు. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో ఘనంగా జరగనుంది. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ ఈ అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఉత్సవానికి వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షార్ట్ ఫిలిం మేకర్లందరికీ ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. పాల్గొనదలచిన వారు 3 సెకన్ల నుంచి 25 నిమిషాల వరకు నిడివి గల షార్ట్ ఫిలిమ్స్ తయారు చేసి, HISFF అధికారిక వెబ్‌సైట్ hisff.in ద్వారా నేరుగా అప్‌లోడ్ చేయాలి. ఫెస్టివల్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్థాయి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు పాల్గొననున్నారు. ఫెస్టివల్ చివరి రోజున తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అంతర్జాతీయ సినీ ఉత్సవాల వేదికగా హైదరాబాద్ ప్రతిష్టను పెంచడమే తమ లక్ష్యమని దిల్ రాజు చెప్పారు. అదే సమయంలో ఆయన వెల్లడించిన మరో అంశం.. వచ్చే ఏడాది నవంబర్ 14 నాటికి అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాన్ని (ICFF) హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
SSMB 29 : ఫస్ట్ టైమ్ అలాంటి పని చేస్తున్న జక్కన్న.. మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్
