సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకొంటోంది. విడుదలకు ముందే ఈ సినిమాకు పోస్టర్లు, పాటలు, ట్రైలర్ తో మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ఇష్టపడే సినీ ప్రేమికులు థియేటర్లో సందడి చేస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవిలు పర్ఫామెన్స్ పరంగా మరో మెట్టుఎక్కారని సినీ విమర్శకులు సైతం పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చూపించిన ఓ సీన్ పట్ల హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ సందర్భంలో ‘పూజ గదిలో లక్ష్మీదేవితో పాటుగా జీసస్ ఫోటో కూడా పక్కపక్కనే ఉంటాయి. ఈ సందర్భం అనవసరం అయినా శేఖర్ కమ్ముల అన్ని మతాల ప్రేక్షకులను ఆకర్షించేందుకు చేసిన ఈ ప్రయత్నం సరైంది కాదంటున్నారు. ఏ హిందూ పూజగదిలో జీసస్ ఫోటో ఉండండంటూ ఆగ్రహిస్తున్నారు. ఈ ప్రయత్నం చర్చిల్లోనో, మసీదుల్లోనో చెయ్యగలరా..? అంటూ ప్రశిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి మొబైల్ రింగ్ టోన్ కూడా శిరిడీసాయి పెట్టుకొని, ఫోన్ వచ్చిన ప్రతిసారి ఇర్రిటేట్ అయ్యి అవమానించారని సోషల్ మీడియాలోను నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈమధ్యకాలంలో వస్తున్న సినిమాల్లోను ఏదోవొక సందర్భాల్లో హిందూ మతాన్ని, దేవుళ్ళని చిన్నచూపు చూపిస్తున్నారని మండిపడుతున్నారు. శేఖర్ కమ్ముల తక్షణమే హైందవసమాజానికి క్షమాపణలు చెప్పి ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరుతున్నారు. శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ కూడా ఇలాంటి సన్నివేశాలు తియ్యడటమేంటని ప్రశిస్తున్నారు. ఆ సీన్ తొలగించాలని యెడల పోలీస్ ఫిర్యాదు చేస్తామని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైనా చిత్రయూనిట్ ఏమైనా స్పందిస్తోందో, లేదో చూడాలి.
