Hi Nanna Vs Extra Ordinary Man Movies: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పెద్ద సినిమాలు అనేకంటే మంచి పేరున్న హీరోల సినిమాలు అనుకోవచ్చు. అవే హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు. ఒకటి నాని హీరోగా నటించిన సినిమా కాగా మరొకటి నితిన్ హీరోగా నటించిన సినిమా. ఇక నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా బేబీ కియారా ఒక కీలక పాత్రలో నటించింది. ఆమె పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ అయింది. అయితే ఈ సినిమా సీరియల్ లా ఉందని చాలా మంది అంటుంటే మరికొంతమంది మంచి ఎమోషనల్ గా ఉందని అంటున్నారు. నిజానికి తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అవకాశం తక్కువే. ఎందుకంటే తండ్రి ఎమోషన్స్ అర్ధం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అది నాన్న అయి ఉండాల్సిందే అన్నట్టు అనిపిస్తుంది.
Bhopal: కారు కొనే స్థోమతలేక బావమరిది బైక్ తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
ఈ సినిమా నేటితరం వారికి అంటే యూత్ కి కనెక్ట్ అవడం కష్టమే. అయితే నాని, మృణాల్, కియారా వంటి వారి నటన మాత్రం హైలైట్ అయ్యాయి. అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువ కాబట్టి ఆ ఎఫెక్ట్ వసూళ్ల మీద కనిపించింది. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్ట్ చేయగా నితిన్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమా ఆద్యంతం కామెడీతో నవ్విస్తూనే కొన్ని ట్విస్టులతో నడిపించే ప్రయత్నం చేశారు. మొదటి భాగం కామెడీ బాగానే వర్కౌట్ అయినా రెండో భాగం మాత్రం లాజిక్స్ లేకుండా కథ ఎటెటో వెళ్లిపోతుంది ఏమో అనిపిస్తుంది. అయితే ఈ సినిమా కామెడీ కారణంగా యూత్ సహా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది తెలియాలి.