Site icon NTV Telugu

Hi Nanna: కంటెంట్ ఈజ్ కింగ్.. ఏకంగా 11 అవార్డులు కొట్టిన హాయ్ నాన్న

Hi Nanna

Hi Nanna

Hi Nanna Sweeps Oniros Film Awards, March edition, New York with 11 Prestigious Wins: అంతర్జాతీయంగా “హాయ్ డాడ్” పేరుతో విడుదలైన మా చిత్రం “హాయ్ నాన్న” ప్రతిష్టాత్మకమైన ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్, మార్చి ఎడిషన్, న్యూయార్క్‌లో వివిధ విభాగాల్లో 11 అవార్డ్‌లను కైవసం చేసుకున్నట్లు సినిమా టీం అనౌన్స్ చేసింది. ఈ విశేషమైన విజయం మా తారాగణం, టీం అసాధారణ ప్రతిభను సెలబ్రేట్ చేయడమే కాకుండా ప్రపంచ వేదికపై మా స్టొరీ టెల్లింగ్, యూనివర్సల్ అప్పీల్ ప్రభావాన్ని కూడా చాటుతోందని ప్రకటించింది. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన “హాయ్ నాన్న”లో అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న నేచురల్ స్టార్ నానితో పాటు వెర్సటైల్ మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఇద్దరూ తమ అత్యుత్తమ నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌లో “హాయ్ నాన్న”కి 1. ఉత్తమ డ్రామా చిత్రం 2. ఉత్తమ నటుడు 3. ఉత్తమ నటి 4. ఉత్తమ నటన ద్వయం 5. ఉత్తమ బాల నటి 6. ఉత్తమ దర్శకుడు 7. ఉత్తమ స్క్రీన్ ప్లే 8. ఉత్తమ నూతన దర్శకుడు 9. ఉత్తమ సినిమాటోగ్రఫీ 10. ఉత్తమ సౌండ్‌ట్రాక్ 11. ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీలలో అవార్డులు గెలిచింది..

Manchu Vishnu: మళ్ళీ మా అధ్యక్షుడుగా మంచు విష్ణు ఏకగ్రీవం.. అసలు నిజం ఇదీ!

ఇక ఈ అంశం మీద దర్శకుడు శౌర్యువ్ తన ఆనందాన్ని పంచుకుంటూ..”ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్ నుండి ఇంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందడం గొప్ప అనుభవం, ఇది “హాయ్ నాన్న” ప్రతి అంశంలో చూపించిన కృషి, అంకితభావాన్ని ధృవీకరిస్తోందని అన్నాడు.. ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, మొత్తం తారాగణం, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు “హాయ్ నాన్న” భారతీయ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై విమర్శకుల ప్రశంసలు కూడా పొందిందని ఆయన అన్నారు.

Exit mobile version