Site icon NTV Telugu

Hi Nanna: దసరా సినిమాతో ఆ రేర్ సాధించాడు నాని…

Hi Nanna

Hi Nanna

హాయ్ నాన్న సినిమా ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కన్నా ఓవర్సీస్ లోనే ఇంకా ఎక్కువగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది హాయ్ నాన్న. నాని ఓవర్సీస్ వెళ్లి మరీ హాయ్ నాన్న సినిమాని మరింత ప్రమోట్ చేసాడు, ఈ ప్రమోషన్స్ హాయ్ నాన్న కలెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఈ మూవీ నాని టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది, మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. బేబీ కియారా యాక్టింగ్ కి ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. ఓవర్సీస్ లో హాయ్ నాన్న సినిమా 1.8 మిలియన్ క్రాస్ చేసి 2 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. నానికి ఇప్పటికే యుఎస్ మార్కెట్ లో ఎనిమిది వన్ మిలియన్ డాలర్ వన్ మిలియన్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు హాయ్ నాన్న 2 మిలియన్ చేరువలో ఉంది.

ఒకే ఏడాది రెండు 1.8 మిలియన్ డాలర్స్ సినిమాని ఇచ్చిన ఏకైక హీరోగా నాని నిలిచాడు. తెలుగు నుంచి ఏ స్టార్ హీరోకి కూడా ఒకే ఇయర్ లో రెండు 1.8 మిలియన్ మూవీస్ లేవు. ఈ రేర్ ఫీట్ ని లవ్ స్టోరీతో సాధించాడు నాని. అనిమల్ ర్యాంపేజ్ ని హాయ్ నాన్న తట్టుకుంటుందా? అసలు హైప్ లేదు, ఓపెనింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి, నాని స్టైల్ రెగ్యులర్ ప్రేమకథనే… ఇలా అనేక మాటలు హాయ్ నాన్న సినిమా రిలీజ్ సమయంలో వినిపించాయి. ఈ విషయాలని పట్టించుకోకుండా హాయ్ నాన్న సినిమాని ఆడియన్స్ కి దగ్గరయ్యేలా చేసాడు. అన్ని ఆడ్స్ ని పాజిటివ్ గా మార్చుకున్న నాని హాయ్ నాన్న సినిమాతో 2 మిలియన్ డాలర్స్  అందుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వేషన్ అయ్యింది. ఎందుకంటే సలార్, డంకీ సినిమాలు వచ్చేసాయి కాబట్టి హాయ్ నాన్న సినిమాకి థియేటర్స్ తగ్గే అవకాశం ఉంది.

Exit mobile version