NTV Telugu Site icon

Hi Nanna: ‘నాన్న’కి హాయ్ చెప్పిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌ అవార్డ్

Hidad, Received The Prestigious Award For Best Feature Film

Hidad, Received The Prestigious Award For Best Feature Film

Hi Nanna Dubbed Version Hi Dad bagged Athens International Art Film Festival Award:నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన “హాయ్ నాన్న”, అంతర్జాతీయంగా “హాయ్ డాడ్”గా విడుదలై ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ మార్చ్ 2024 ఎడిషన్‌లో ప్రదర్శితం అయింది. ఇక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ మార్చ్ 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును కైవసం చేసుకుందని అనౌన్స్ చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నామని సినిమా యూనిట్ ప్రకటించినది. టాలెంటెడ్ డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించిన “హాయ్ నాన్న” అద్భుతమైన కథనం, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్, యూనిక్ సినిమాటిక్ విజన్ తో ప్రేక్షకులను మాత్రమే కాదు ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ న్యాయనిర్ణేతలను సైతం ఆకర్షించింది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లభించిన ఈ గుర్తింపు నిర్మాతలుగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని నిర్మాత పేర్కొన్నారు. ‘

Urfi Javed : ఉర్ఫీ.. ఏంటీ అరచాకం.. ఫ్యాన్లు ఏంటి అక్కడ పెట్టావ్?

అంతర్జాతీయ వేదికపై మా పని యొక్క యూనివర్సల్ అప్పీల్, క్వాలిటీకి దక్ఖిణా గౌరవం ఇది అన్నారు. ఇక దర్శకుడు శౌర్యువ్ మాట్లాడుతూ “ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘హాయ్ నాన్నా’కి ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. “సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా కథ చెప్పే శక్తిని ఈ విజయం అందించింది, ఫెస్టివల్ నిర్వాహకులకు, జ్యూరీకి, ‘హాయ్ నాన్నా’కి ప్రాణం పోసిన మా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు. గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్‌లో “హాయ్ నాన్న” అకా “హాయ్ డాడ్”కు లభించిన మద్దతు, ప్రశంసలను చూసి గర్విస్తున్నా,. ఈ అవార్డు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి సమిష్టి కృషికి నిదర్శనం, ఇది మరిన్ని అద్భుతమైన చిత్రాలని అందించడానికి మాకు స్ఫూర్తినిస్తుందని మేకర్స్ ప్రకటించారు.