Site icon NTV Telugu

Hi NANImal: ఈ ఇంటర్వ్యూ ఐస్ అండ్ ఫైర్ కాంబినేషన్ లా ఉంది

Hi Nanimal

Hi Nanimal

హీరో నాని చాలా కూల్ గా సింపుల్ గా పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫైర్ మోడ్ లో బీస్ట్ లా ఉంటాడు. ఇలాంటి రెండు వేరు వేరు ధృవాల్లాంటి నాని-సందీప్ రెడ్డి వంగ కలిస్తే ఆ కాంబినేషన్ ఫైర్ అండ్ వాటర్ లా ఉంటుంది. ఈ మాటని నిజం చేస్తూ నాని-సందీప్ రెడ్డి వంగ కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు. సందీప్ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. నాని నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. వారం గ్యాప్ లో రిలీజ్ కానున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ క్లాష్ కి రెడీ అవుతుంటే… నాని-సందీప్ మాత్రం కలిసి ఒక ఇంటర్వ్యూ చేసారు. #HiNANImal అంటూ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో బయటకి వచ్చింది.

నాని-సందీప్ కలిస్ కూర్చోని సరదాగా తమ సినిమాల గురించి మాట్లాడిన ఫుల్ ఇంటర్వ్యూ త్వరలోనే బయటకి రానుంది. ప్రోమో మాత్రం రిలీజ్ అయ్యింది. ఇందులో నాని సందీప్ ల మధ్య ప్రమోషన్స్ గురించి, కథల గురించి, రిలీజ్ డేట్ ల గురించి చర్చ జరిగింది. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని పెద్దగా రివీల్ చెయ్యలేదు కానీ సందీప్ నానిని హాయ్ నాన్న కథ గురించి రెండు ప్రశ్నలు వేయడంతో కథ అంతా అడిగేస్తున్నారు అని నాని చెప్పడం బాగుంది. రిలీజ్ డేట్ విషయంలో సందీప్ ఇంకో నెల రోజులు ఉంటే బాగుండేదని చెప్పాడు అండ్ అనిమల్ సినిమా నిడివి విషయంలో కూడా తగ్గించడానికి రెండు రోజులు కూర్చున్నాను కానీ 8 నిముషాలు మాత్రమే కట్ చేయగలిగాను అని చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. మరి ఫుల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో? ఎప్పుడు బయటకి వస్తుందో చూడాలి.

Exit mobile version