టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు లోని పుదుచ్చేరిలో క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుల విచారణ నేపధ్యంలో దాదాపు రూ. 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు వ్యవహారం ఇప్పడు టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ మెడకు చుట్టుకుంది.
Also Read : Posani Case : పోసానికి 14 రోజుల రిమాండ్
విచారణలో భాగంగా రూ. 60 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్‌కు సంబంధించి హీరోయిన్ తమన్నా, కాజల్ అగర్వాల్‌లను విచారించనున్నారు పుదుచ్చేరి సైబర్ క్రైం పోలిసులు. క్రిప్టోకరెన్సీ ద్వారా అధిక లాభాలు ఇస్తానని మూడున్నర కోట్లు రూపాయల తీసుకుని మోసం చేశారని పుదుచ్చేరి చెందిక ఆశోకన్ అనే ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఫిర్యాదు చేసాడు. ఈ నేపధ్యంలో నీతీష్ జైన్,అరవింద్ కూమార్ అరెస్టు చేసారు. విచారణలో సమయంలో కీలకమైన విషయాలు రాబట్టారు పోలీసులు. పుదుచ్చేరి లో మాత్రమే కాకుండా ఆంద్రప్రదేశ్, చెన్నై,కోయంబత్తూరు లోను క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. అయితే ఈ క్రిప్టోకరెన్సీ కి సంబందించి 2022లో కోయంబత్తూరు జరిగిన లాంచింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు హీరోయిన్స్ తమన్నా,కాజల్ అగర్వాల్. వారు ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉండవచ్చనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలిసులు.ఈవెంట్లో పాల్గొన్నందుకు డబ్బులు ఎలా ఇచ్చారు, ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారు అనే వివరాలను సేకరించనున్నారు పుదుచ్చేరి పోలీసులు.