ఓ వైపు హీరోయిన్లుగానే రాణిస్తూ మరో వైపు విలనీలుగానూ మారుతున్నారు కొందరు నటీమణులు. ఈ తరం నటీమణులకు నెగిటివ్ షేడ్స్ లో కూడా ఓ కిక్కు ఉంది అని ఫ్రూవ్ చేసిన సీనియర్ యాక్టర్ రమ్య కృష్ణ. నరసింహలో నీలాంబరిగా ఆమె చేసిన నటనకు ఫిదా కానీ ఆడియన్ లేదు. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లకు అది ఓ ఫేవరేట్ క్యారెక్టర్. మోస్ట్లీ నెగిటివ్ రోల్స్ అన్నీ తమిళ ఇండస్ట్రీ నుండి పుట్టుకొచ్చినవే. ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్స్ లో రమ్య కృష్ణను కొట్టిన హీరోయిన్ లేదనే చెప్పొచ్చు. ‘నా మనసిస్తారా’లో కొంత మెప్పించింది సౌందర్య. రీసెంట్లీ సలార్ లో నెగిటివ్ షేడ్ లో మెప్పించింది శ్రియా రెడ్డి. ఇక రీమాసేన్ కూడా ప్రేమ పేరుతో శింబును వల్లభలో మోసం చేస్తుంది. ఆమెది పర్వర్డెడ్ రోల్.
Also Read : Rishab Shetty : ‘ఛత్రపతి శివాజీ’ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి
ఇక అందాల భామలు త్రిష, సమంతలతో నెగిటివ్ రోల్స్ చేయించారు దర్శకులు. విక్రమ్ ‘టెన్’ సినిమాలో సమంత, ధర్మయోగిలో త్రిష విలన్ క్యారెక్టర్లలో మెప్పించగలిగారు. అంతేకాదు జ్యోతిక, సిమ్రాన్ లాంటి స్టార్ భామలు కూడా తమిళంలో విలనీలుగా ఫెర్పామెన్స్ స్కోప్ రోల్స్ లో మెస్మరైజ్ చేశారు. రీసెంట్లీ పొన్నియన్ సెల్వన్ లో అందాల బొమ్మ ఐశ్వర్య రాయ్ లో మణిరత్నం నెగిటివ్ యాంగిల్ చూపించాడు. అలాగే విలనీ రోల్ కు ఫర్పెక్ట్ పర్యాయ పదంగా మారింది వరలక్ష్మీ శరత్ కుమార్. పందెంకోడి 2, తెనాలి రామకృష్ణ, క్రాక్, వీరసింహారెడ్డి, యశోద విలనీ క్యారెక్టర్స్ ఈమె కోసమే పుట్టాయా అనిపించేలా చేసింది. రీమాసేన్, సౌందర్య, శ్రియా రెడ్డి మినహాయించి మిగిలిన భామలంతా ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. సో దీన్ని బట్టి చూస్తే పాజిటివ్ కన్నా నెగిటివ్ రోల్సే హీరోయిన్ కెరీర్ నిలబెడుతున్నాయాన్న డౌట్ రాకమానదు.