Site icon NTV Telugu

Love Mouli: లిప్ లాక్ ఇచ్చి ప్రేయసిని పరిచయం చేసిన నవదీప్

navadeep

navadeep

టాలీవుడ్ హీరో నవదీప్ చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్ గా కనిపించి మెప్పించాడు. ఇక నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా లవ్ అఫ్ మౌళి అంటూ తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఈ సినిమాలోని హీరోయిన్ లుక్ ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపింది.

ఇక హీరోయిన్ స్పెషల్ వీడియోలో పంఖురి గిద్వానీని చిత్ర గా పరిచయం చేశారు. నవదీప్ తో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించిన ముద్దుగుమ్మ రూపం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కర్లీ హెయిర్ లో చాలా డిఫెరెంట్ గా ఉన్నా అందంగానే ఉంది. ఇక చివర్లో మౌళి , చిత్రకు లిప్ లాక్ ఇస్తూ తన ప్రేయసిని పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నవదీప్ 2.o బయటికి వస్తాడేమో చూడాలి.

Exit mobile version