Site icon NTV Telugu

Rambha Daughter: హీరోయిన్లను మించేలా రంభ కూతురు.. స్టార్ హీరోతో ఫొటోలు చూశారా ?

Rambha Daugter

Rambha Daugter

Heroine Rambha Daughter: హీరోయిన్ రంభ ఇమే గురుంచి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్స్ లో రంభ ఒకరు. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. 15 ఏళ్లకే చదువుకు బ్రేక్ ఇచ్చి హీరోయిన్ గా మారింది. 1992లో విడుదలైన మలయాళ చిత్రం సర్గం తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. తెలుగులో ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం అయ్యింది. ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రంభ. అప్పట్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నారు రంభ. అందంతో పాటు తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. అప్పటి స్టార్ హీరోయిన్స్ కి మరియు స్టార్ హీరోలకు సైతం డాన్సులో కూడా పోటీ ఇస్తూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాదు. తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

Also Read: Amitabh Bachchan: ప్రభాస్ కి అది కొత్త ఏంకాదు అంటున్న బిగ్ బి

తెలుగులో రంభ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రంభ. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పించారు రంభ. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇప్పటికి కూడా తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు రంభ. పిల్లి తర్వాత రంభ సినిమాలకు దూరం అయ్యింది. ఈ అందాల భామ మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకునింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు. ఇదిలా ఉంటే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో రంభ ఫ్యామిలీ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో రంభ పెద్ద కూతురు చాలా అందంగా ఉంది. అచ్చం తల్లిలానే ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది ఈ చిన్నది. హాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసుకుపోని అందంతో మెరిసిపోతుంది.

Exit mobile version